రాష్ట్రీయం

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి వార్త అందించింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో ఈ నెల 16వ తేదీ నుంచి వైద్య సేవలు లభించబోతున్నాయి. సమన్వయం, సమాచారం లోపం వలన ఎవరికైనా హెల్త్‌కార్డులు లభించకపోతే దశలవారీగా అందేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హెల్త్‌కార్డులు జారీ అయినప్పటికీ అమలు కావటం లేదనే అసంతృప్తివెల్లువ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జెఎసి తరపున అశోక్‌బాబు, చంద్రశేఖరరెడ్డి, సోమేశ్వరరావు, పబ్బరాజు వెంకటేశ్వరరావు, కమలాకరరావు అలాగే ఆసుపత్రుల తరపున డాక్టర్ మురళీ, డాక్టర్ రమేష్, డాక్టర్ పివి రమణపూర్తి, ప్రభుత్వం తరపున సీనియర్ ఐఎఎస్ అధికారులు రవిచంద్ర, పూనం మాలకొండయ్య, ప్రత్యుమ్న పాల్గొన్నారు. వివిధ చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ఏ మాత్రం సరిపోవని ఆసుపత్రిల యాజమాన్యాల సంఘం తెలుపగా రేట్లు పెంచే విషయంపై ఆరు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని పెరిగిన రేట్లను ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగులకు కొన్ని వసతులు కల్పించాలని జెఎసి నేతలు కోరారు. దీన్ని కూడా పరిశీలిస్తామని సిఎం హామీనిచ్చారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు ఉద్యోగుల తరపున రూ. 200 కోట్లు, ప్రభుత్వం తరపున రూ. 200 కోట్లు ఇలా ప్రతి ఏడాది రూ. 400 కోట్లను ప్రత్యేక నిధి కింద జమ చేయాలని జెఎసి నేతలు కోరగా ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ ట్రస్ట్‌లో పర్యవేక్షణ నిమిత్తం జెఎసి నేతలకు ప్రాధాన్యత కల్పించటానికి సిఎం అంగీకరించారు.

నలుగురు
డిఎస్పీలకు పదోన్నతులు

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో నలుగురు డిఎస్పీలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వెయిటింగ్‌లో వున్న డిఎస్పీ ఎం మునిరామయ్యను పదోన్నతిపై బదిలీ చేస్తూ తిరుమలలో ఖాళీగా వున్న ఎస్‌డిపిఓగా నియమించారు. గుంటూరు అర్బన్ డిఎస్పీ (సిఐడి) ఎస్‌వివి ప్రసాదరావును బదిలీ చేస్తూ ఎసిబి డిఎస్పీగా పదోన్నతి కల్పించారు. డిఎస్పీ (సిఐడి) కెజివి సరితను పశ్చిమ గుంటూరు ఎస్‌డిపిఓగా నియమిస్తూ బదిలీ చేశారు. అదేవిధంగా గుంటూరు అర్బన్ సిసిఎస్ డిఎస్పీ కె జగదీశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.