రాష్ట్రీయం

వస్తున్నాయ్.. మెగా ఫుడ్‌పార్క్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణకు నాలుగు మెగా ఫుడ్ పార్కులు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 42 మెగా ఫుడ్‌పార్కులను రూ. 6,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో తెలంగాణకు నాలుగు కేటాయించామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో భారత పరిశ్రమల సమాఖ్య సౌజన్యంతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ రోడ్ షోను నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్ 3నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న మూడు రోజుల మెగా ఈవెంట్ ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2017’ ను దృష్టిలో ఉంచుకుని రోడ్‌షోను హైదరాబాద్‌లో నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న బాదల్ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశంలో ఆహార రంగ పరిశ్రమకు రానున్న రోజుల్లో 31వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. ఆహార రంగ ఉత్పత్తుల్లో పెట్టుబడులకు తెలంగాణ అనువైనదని కితాబిచ్చారు. ప్రస్తుతం మనదేశంలో కేవలం 10 శాతం ఆహార పదార్ధాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నామని, ఇంకా ఈ సామర్ధ్యం పెరిగితే ఆదాయం పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. వరల్డ్ ఫుడ్ ఈవెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చినందుకు బాదల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ భారత దేశంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ వరల్డ్ ఫుడ్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈవెంట్‌ను ప్రతి ఏడాది నిర్వహించాలని మంత్రి కోరుతూ తర్వాత జరిగే రెండో ఎడిషన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని ఆయన కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్‌పార్కుల నిర్వహణకు ప్రైవేటు వ్యక్తులను పిలుస్తున్నామని చెప్పారు. నాలుగు ఫుడ్‌పార్కులు తెలంగాణకు మంజూరు చేసినందుకు మంత్రి కెటిఆర్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ రోడ్ షోలో మాట్లాడుతున్న ఐటి మంత్రి కెటిఆర్