రాష్ట్రీయం

148వ రక్షణ ఉద్యోగుల పెన్షన్ అదాలత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: రక్షణ రంగంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన 148వ రక్షణ ఉద్యోగుల పెన్షన్ అదాలత్‌లో 560 సమస్యలు పరిష్కరించారు. సికింద్రాబాద్ ఎంసిఈఎంఈ ఆడిటోరియంలో నిర్వహించిన రెండు రోజు అదాలత్‌లో భాగంగా గురువారం తొలిరోజు అదాలత్‌ను రక్షణ గణాంక శాఖ కంట్రోలర్ జనరల్ వీణా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. డిఫెన్స్ పెన్షన్ బుక్‌లెట్‌ను వీణా ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రధాన కంట్రోలర్ (పెన్షన్) మాట్లాడుతూ రక్షణ శాఖ పెన్షనర్లకు అందిస్తున్న వివిధ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ-సేవల ద్వారా అమలు జరుగుతున్న విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రసబ్ ఏరియా మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు మాజీ సైనికుల అందించిన సేవలను కొనియాడారు.