రాష్ట్రీయం

అసోసియేషన్ల భవనం వ్యవహారంలో మీ జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఎపి ఎన్‌జిఓలు-్భగ్యనగర్ టిఎన్‌జిఓలు కూర్చుని హైదరాబాద్ (గన్‌ఫౌండ్రీ) లోని తమ భవనానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. ఎపిఎన్‌జిఓల భవనంలో కొంత భాగాన్ని భాగ్యనగర్ టిఎన్‌జిఓలకు కేటాయిస్తూ రాష్టప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల ‘స్టే’ ఇచ్చారు. ఈ స్టేను సవాలు చేస్తూ భాగ్యనగర్ తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్ ఈ సూచన చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి. రజని ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. ఎపి ఎన్‌జిఓల అసోసియేషన్ బాగ్యనగర్ టిఎన్‌జిఓలకు జారీ చేసిన నోటీసును ఎపిఎన్‌జిఓల సంఘం ఉపసంహరించుకోవాలని, అలాగే భాగ్యనగర్ టిఎన్‌జిఓలు భవనంపై ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని డివిజన్ బెంచ్ సూచించింది. రెండు సంఘాల ప్రతినిధులు కూర్చుని సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరపాలని, ఈ సమస్యలను సహకార సంఘం చట్టానికి లోబడి పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని డివిజన్ బెంచ్ సూచించింది. భాగ్యనగర్ టిఎన్‌జిఓల సంఘం తరఫున న్యాయవాది ఎ. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, వాస్తవంగా భాగ్యనగర్ టిఎన్‌జిఓల సభ్యులంతా ఎపి ఎన్‌జిఓల సంఘంలో సభ్యులేనని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సభ్యులను భవనంలోకి రాకుండా ఎపిఎన్‌జిఓలు అడ్డుకున్నారని, అందువల్ల వివాదం మొదలైందని గుర్తు చేశారు. భవనంపై ఏర్పాటు చేసిన బోర్డులను తొలిగించేందుకు భాగ్యనగర్ టిఎన్‌జిఓల సంఘం సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసును సోమవారానికి వాయిదావేశారు.