రాష్ట్రీయం

లోయలోపడ్డ బస్సు: 19 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, జూలై 27: నెల్లూరుకు చెందిన షాజీ ట్రావెల్స్ బస్సు గురువారం పుదుచ్చేరి సమీపంలో ప్రమాదవశాత్తు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుపాడు గ్రామానికి చెందినవారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు తలుపూరుపాడు గ్రామానికి చెందిన 45 మంది బుధవారం మధ్యాహ్నం షాజీ ట్రావెల్స్ బస్సులో నాగూరునాగపట్నం యాత్రకు బయలుదేరారు. నాగూరునాగపట్నం చేరుకోక ముందే పుదుచ్చేరి సమీపంలో ఓ వాహనం ఎదురుగా రావడంతో ప్రమాదవశాత్తు 30 అడుగులు ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పుదుచ్చేరి పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలో ఉన్న వైద్యశాలకు తరలించి చికిత్సలు చేయించారు. స్వల్ప గాయాలైన వారు సంఘటనా స్థలం సమీపంలో ఉన్న ఓ కల్యాణ మండపంలో తలదాచుకున్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు ఫోన్ చేసి బాధితులకు సహాయచర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పుదుచ్చేరి కలెక్టర్‌తో మాట్లాడి క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నాయుడుపేట ఆర్డీఒ శీనానాయక్‌ను పుదుచ్చేరి పంపించారు. బాధితులను క్షేమంగా స్వగ్రామానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు.