రాష్ట్రీయం

గురుకుల విద్యార్థుల పరీక్షలపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గురుకులాల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ విద్యార్థులకు రానున్న రోజుల్లో కామన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం 10 మందితో కూడిన కమిటీని నియమించిందని విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా చెప్పారు. రాష్ట్రంలోని ఎపి రెసిడెన్షియల్ సొసైటీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, బిసి వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కామన్ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ కమిషనర్, ఎస్‌పిడి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్, గురుకుల కార్యదర్శులతో ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లో తమ నివేదికను ఇస్తుంది. ప్రభుత్వం నివేదికను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యపై ఎస్‌టియు అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిసెచ్ జోసఫ్ సుధీర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. కాగా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పిజిటి ఇంగ్లీషు, మాథ్స్, సైన్స్ టీచర్లను ఇంటర్ మూల్యాంకానికి అనుమతించాలని వారు కోరారు. మోడల్ స్కూల్ విద్యార్ధులకు నష్టం వాటిల్లకుండా గతంలో మాదిరి మిగులు టీచర్లను ఇంటర్ మూల్యాంకానికి వినియోగించుకోవాలని విద్యాశాఖ కమిషనర్ కె సంథ్యారాణిని కోరినట్టు చెప్పారు.
స్పెషల్ ఎడ్యుకేషన్‌కు రిజిస్ట్రేషన్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ బి.ఇడి, ఎంఇడి స్పెషల్ ఎడ్యుకేషన్‌కు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. బి.ఇడి కోర్సు రెండేళ్లు ఉంటుందని, అది తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నామని వర్శిటీ అధికారులు తెలిపారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మాత్రం రెండున్నరేళ్లు ఉంటుందని దానిని తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం జనవరి 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 14న పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.

బిల్ట్‌ను నిలబెట్టండి
ఆంధ్ర నుంచి యూకలిప్టస్ కలప ఇవ్వండి
చంద్రబాబును కోరిన తెలంగాణ మంత్రులు

హైదరాబాద్, జనవరి 13: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ ఆంధ్రప్రదేశ్ సిఎం ఎన్ చంద్రబాబునాయుడిని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. వరంగల్ జిల్లాలోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్)కు సబ్సిడీపై యూకలిప్టస్ కలప అందజేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిన బిల్ట్‌ను తిరిగి తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సిఎం కె చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. బిల్ట్‌కు అవసరమైన కాగితం గుజ్జు కోసం యూకలిప్టస్ కలపను ఆంధ్రనుంచి దిగుమతి చేసుకోవాలి. దీంతో సబ్సిడీతో కలప ఇవ్వాలని కోరుతూ సిఎం కెసిఆర్ ఆంధ్ర సిఎం చంద్రబాబుకు ఈనెల 6న లేఖ రాశారు. లేఖ ప్రతిని మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబునాను క్యాంప్ కార్యాలయంలో కలిసి యూకలిప్టస్ కోసం లేఖ అందజేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని మంత్రులు తెలిపారు.