రాష్ట్రీయం

మూత్రపిండ వ్యాధుల రహస్యం ఛేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ కవిటి జూలై 29: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రజలు మూత్రపిండ వ్యాధులతో సతమతం కావడానికి గల కారణాలు కనుగొంటామని హార్వర్డ్ వైద్య కశాశాల ప్రతినిధి బృందం సభ్యుడు జోసెఫ్ బాన్‌వెంట్రీ పేర్కొన్నారు. ఉద్దానం పర్యటనకు వెళ్లే ముందు తన సహచరుడు వెంకట్ సుబ్బిశెట్టి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టి రవిరాజ్‌తో కలిసి విశాఖ కెజిహెచ్‌లో శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఉద్దానంలో 20 శాతం ప్రజానీకం మూత్రపిండాల వ్యాధితో బాధపడటం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒకే ప్రాంతంలో ఇంత మంది కిడ్నీ సమస్యతో బాధపడటం వెనుక గల కారణాలు కనుగొనేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉండేవారి ఆహార అలవాట్లు, జీవన విధానం, ఈ ప్రాంతంలో లభ్యమయ్యే నీటిలో ఖనిజాల సాంధ్రత, పర్యావరణ పరంగా చోటుచేసుకుంటున్న అంశాలతో పాటు గత రెండున్నర దశాబ్దాలుగా వ్యాధిపై సేకరించిన వివరాలను క్రోఢీకరించనున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్త పరీక్ష విధానాన్ని ఉద్దానంలో అనుసరిస్తామన్నారు. కెఐఎం 1 రక్త పరీక్షల
ద్వారా కిడ్నీ వ్యాధి లక్షణాలను గుర్తించడం సులభమైన మార్గమని తెలిపారు. తద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజ్ ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరించారు. ఉద్దానంలో యువత, నడివయస్కులు ఎక్కువగా కిడ్నీ వ్యాధికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే దీనిపై పూర్తి సర్వే నిర్వహించామని, బాధితులకు తక్షణ వైద్య సదుపాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక మోబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. వ్యాధిగ్రస్తుల పూర్తి వివరాలతో పాటు వారి మొబైల్ నెంబర్లను సేకరించి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామన్నారు. అనంతరం వైద్యుల బృందం ఉద్దానం బయలుదేరి వెళ్లింది.
రోగులతో ముఖాముఖి
అంతకుముందు ఉద్దాన ప్రాంతమైన కవిటి మండలం, బొరివంకలో శనివారం కిడ్ని రోగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోసెఫ్ రోగులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి బారినపడిన వారికి ఏవిధమైన వైద్య సదుపాయాలు అందించాలో చర్చిస్తామని, తద్వారా ఉద్దాన ప్రాంతాన్ని ఆదుకుంటామన్నారు.

చిత్రం.. బొరివంకలో కిడ్నీ రోగులతో ముఖాముఖి నిర్వహిస్తున్న హార్వర్డ్ విశ్వ విద్యాలయ వైద్య నిపుణుడు జోసెఫ్