రాష్ట్రీయం

తెలంగాణ బంగారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ బంగారమే. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి పన్ను విధానంతో ఆదాయం తగ్గుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర ఖజానాపై కాసుల వర్షం కురిసింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక కాలంలో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 11 శాతం పెరిగింది. 2016-17లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.11,895 కోట్లు వసూలైతే, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రూ. 13,194.42 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు రూ.1300 కోట్ల ఆదాయం ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణకు పెరిగిన ఆదాయం నిదర్శనంగా భావించాలి. వాణిజ్య పన్నుల శాఖలో గత ఏడాది కంటే 8.20 శాతం వృద్ధిరేటుతో రూ. 697.87 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. గత ఏడాది రూ.1384.88 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది రూ. 9179.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖ కాసుల వర్షం కురిపించింది. నిరుడి కంటే రూ.567.17 కోట్ల ఆదాయం ఎక్కువ. గత ఏడాది రూ. 1384.88 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.1952.05 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలో మాత్రం ఆదాయం ఆశించిన విధంగా లేదు. గత ఏడాదికంటే రూ.108.27 కోట్లు తగ్గింది. కాని రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో పుంజుకుంటుంది. మొదటి మూడు నెలల ఆదాయాన్ని కొలమానంగా భావించాల్సిన పనిలేదని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ శాఖ ద్వారా నిరుడు రూ.1005.60 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది రూ. 897.33 కోట్ల ఆదాయం వచ్చింది. రవాణా శాఖలో 22.33 శాతంమేర ఆదాయం ఎక్కువగా వచ్చింది. గత ఏడాది రూ. 640.26 కోట్లురాగా, ఈ ఏడాది రూ. 783.26 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం పన్ను రెవెన్యూను విశే్లషిస్తే రూ. 11,514.70 కోట్ల నుంచి రూ.12,812.47 కోట్లకు పెరిగింది. దాదాపు 11.27 శాతం మేర పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. పనే్నతర ఆదాయాన్ని విశే్లషిస్తే ఇసుక ద్వారా ఆదాయం 23.67 శాతం మేర పెరిగింది. గత ఏడాది రూ. 134.19 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ. 16 5.95 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపురూ.31.76 కోట్ల ఆదాయం పెరిగింది. గనుల శాఖలో కూడా ఆదాయం పెరగాల్సి ఉంది. గత ఏడాది కంటే రూ.30.43 కోట్లు తగ్గింది. ఈ శాఖ ఆదాయం కూడా నవంబర్ నుంచి మార్చి వరకు పుంజుకుంటుంది. పనే్నతర ఆదాయం రూ. రూ. 380.62 కోట్ల నుంచి రూ. 381.95 కోట్లకు పెరిగింది.