రాష్ట్రీయం

ఫలించిన విద్యుత్ కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: విద్యుత్ సంస్థలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న 20,903 మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఫైలుపై సంతకం చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌డిపిడిసిఎల్ పరిధిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ నాలుగు సంస్థల పాలక మండళ్లు నిర్ణయం తీసుకున్నాయ. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు క్రమబద్ధీకరణపై చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముఖ్యమంత్రి ఆమోదానికి పంపారు. సిఎం దీనిపై శనివారం ఆమోద ముద్ర వేశారు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో తక్కువ జీతం తీసుకుంటూ ఎంతో శ్రమ చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సంతోషంగా ఉందని కెసిఆర్ అన్నారు. ట్రాన్స్‌కోలో 4,197, జెన్‌కోలో 2,914, ఎన్‌పిడిసిఎల్‌లో 4.333 మంది, ఎస్‌పిడిసిఎల్‌లో 9,4659 మంది, మొత్తం నాలుగు సంస్థల్లో కలిపి 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు..
విద్యుత్ సంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారిని క్రమ బద్దీకరిస్తామని చెప్పి మాట నిలుపుకున్న సిఎం కెసిఆర్‌కు విద్యుత్ సంస్థల తరఫున జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సిఎంకి రుణపడి ఉంటారన్నారు. విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సహకరించిన మంత్రి జగదీష్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావులకు ప్రభాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై సిఎం సంతకం చేశారని తెలియగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కల ఫలించిందని ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విద్యుత్ సమస్యలు తీరడమే కాదు, విద్యుత్ సంస్థలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు కూడా తీరాయని అనందాన్ని పంచుకున్నారు. విద్యుత్ సౌధలో ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కార్యక్రమం జరిగింది.