రాష్ట్రీయం

ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లకు తాగునీరు, విద్యుత్ నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఉస్మానియా యూనివర్సిటీ సి హాస్టల్‌లో నాన్‌బోర్డర్లు ఖాళీ చేయాలని పేర్కొంటూ అధికారులు నీటి సరఫరాను, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఇక్కట్లకు గురైన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్ల కార్డులు పట్టుకుని వారంతా వర్సిటీ ధర్నా, నిరసన కార్యక్రమాలను నిర్వహించడంలో వర్శిటీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో పక్క యూనివర్సిటీ ఆర్టు కాలేజీకి వెళ్లే మార్గాలను మూసివేశారు. ఉస్మానియా పోలీసు స్టేషన్ వద్ద బారికేడ్లు అమర్చిన అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. తక్షణమే నీటి సరఫరాను, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇంకో పక్క నాన్ బోర్డర్లు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిందేనని ఉస్మానియా అధికారులు స్పష్టం చేశారు. హాస్టళ్లు దీనవస్థకు చేరుకున్నాయని వాటికి తక్షణం మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని, ఎప్పటికపుడు విద్యార్ధులున్నారని భావించి మరమ్మతులు వాయిదా పడుతున్నాయని, కొన్ని హాస్టళ్లు కుప్పకూలే ప్రమాదం ఉందని వాటన్నింటికీ పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
విధులకు హాజరు కావాలి..
కాంట్రాక్టు అధ్యాపకులు అంతా తక్షణమే విధులకు హాజరుకావాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కమిటీని వేశామని, కమిటీ సమస్యలను అధ్యయనం చేస్తోందని, అంతవరకూ కాంట్రాక్టు అధ్యాపకులు విధులకు హాజరుకావాలని అన్నారు. నేక్ అక్రిడిటేషన్ బృందం యూనివర్సిటీకి రానుందని ఇలాంటి దశలో సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు.
లాఠీచార్జిని ఖండిస్తూ నిరసనలు
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అతిదారుణంగా లాఠీఛార్జీ చేయడాన్ని ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ శనివారం నాడు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు.