రాష్ట్రీయం

ఆనం బ్రదర్స్‌కు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: నెల్లూరుకు చెందిన ఆనం సోదరులు ఆనం రాం నారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలతో పాటు వేలాది మంది కార్యకర్తలు తెలుగు దేశం పార్టీలో అధికారికంగా చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈనెల 17వతేదీన నాలుగు వేల మంది కార్యకర్తలు నాయకులతో సోదరులిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత నెల రెండో తేదీన వీరు నెల్లూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక మంత్రి డాక్టర్ పి నారాయణతో కలిసి విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. వెంటనే సిఎం చంద్రబాబునాయుడు వారికి తెలుగుదేశం కండువాలను కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. అయితే సాంకేతికంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అధికారికంగా తెలుగుదేశంలో చేరితే మంచిదనే భావనను వారు వ్యక్తం చేయడంతో చంద్రబాబు అందుకు అంగీకరించారు. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరని భావించి తాము టిడిపిలో చేరుతున్నట్టు రాం నారాయణ రెడ్డి చెప్పారు. పదవులు తాము కోరలేదని, అందుకోసం మాత్రం పార్టీ మారడం లేదని సోదరులు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి భాగస్వామ్యం కోసమే తాము టిడిపిలో చేరుతున్నట్టు రాం నారాయణ రెడ్డి ఆంధ్రభూమికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని టిడిపి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటం వల్లనే చంద్రబాబునాయుడు వారి చేరికకు అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. పైగా వీరిద్దరి చేరికతో రెడ్డి వర్గాన్ని కూడా ఆకట్టుకోవడానికి వీలవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. ఎన్నికలు గడచిన తర్వాత కూడా కాంగ్రెస్‌పార్టీ ప్రజలను ఆకట్టుకోలేకపోతోందనే భావనతో ఆనం సోదరులు పార్టీ వీడినట్టు తెలుస్తోంది.