రాష్ట్రీయం

ఈ ఏడాదైనా ఆర్టీపీపీ ఆరోయూనిట్ పూర్తయ్యేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 13: కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు 6వ యూనిట్ పనులు అధికారులు ప్రకటించినట్లు ఈ ఏడాది కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. రూ.3,500 కోట్ల ఖర్చుతో నిర్మించతలపెట్టిన 6వ యూనిట్ పనులు 2010లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టునాటికే పూర్తిసామర్థ్యంతో ఉత్పత్తి సాధించాలని జన్‌కో అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గతంలో ఉన్న హిందూ కంపెనీకి పలు సమస్యలు ఎదురుకావడంతో నిర్మాణం బాధ్యతలను అధికార పార్టీ నాయకులు దక్కించుకున్నారు. బిహెచ్‌ఇఎల్, గామన్ ఇండియా, విఏటెక్ లాంటి పెద్ద కంపెనీలు నిర్మాణం పనుల్లో పాలుపంచుకున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 40 నుంచి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని భావిస్తున్నారు. పేరుకు పెద్ద కంపెనీలు పనులు దక్కించుకున్నా సబ్ కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతవరకు సివిల్ పనులు పూర్తికాకపోయినా కొన్ని విభాగాల్లో టెక్నికల్ పనులు కూడా పూర్తికాలేదు. ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన టర్బైన్ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. ఈఎస్పీ, బాయిలర్ పనుల్లో ఎరక్షన్ ఇంకా జరగాల్సివుంది. చినీ పనులు 25 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లా భూపాల్‌పల్లె, కడప జిల్లా ఆర్టీపీపీలో 6వ యూనిట్ నిర్మాణానికి 2010లో ఒకేమారు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. భూపాల్‌పల్లె ప్రాజెక్టు పూర్తయి ఉత్పత్తి సాధిస్తున్నా, ఆర్టీపీపీ 6వ యూనిట్‌లో ఇంతవరకు ఉత్పత్తి జరగకపోవడం వెనుక స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.

గ్రామకంఠంలో ఇళ్లను వదిలేయండి
తుళ్లూరు, జనవరి 13: అమరావతి రాజధాని బృహత్తర ప్రణాళికలో మార్పులుచేసి గ్రామకంఠంలోని తమ ఇళ్లకు తమకు వదిలేయాలని రాయపూడి గ్రామస్థులు సిఆర్‌డిఎ అధికారులను కోరారు. మండలంలోని రాయపూడి, కొండంరాజుపాలెం, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల ప్రణాళికపై అవగాహన సదస్సులు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సిఆర్‌డిఎ అధికారుల నుండి స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో రైతులు అసహనాన్ని వెళ్లగక్కారు. భూములు కోల్పోయిన రైతులకు మాస్టర్‌ప్లాన్ మ్యాప్‌లను ఇవ్వకుండా అభ్యంతరాలను అడగడం సరికాదన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతులను ఏ కమిటీలోనైనా చేర్చారా అని ప్రశ్నించారు. భూ సమీకరణకు చట్టబద్ధత లేనప్పుడు కౌలు పరిహారం, రైతులకు ఇచ్చే నివేశన స్థలాల గురించి ఎవరిని అడగాలి అని నిలదీశారు. భూ సమీకరణకు వచ్చిన ప్రజాప్రతినిధులు మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుకు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలను సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా గ్రామాలన్నీ నీటమునిగి పోతాయని, దీనిపై మాస్టర్‌ప్లాన్‌పై అధికారులకు అవగాహన లేదా అని ప్రశ్నించారు. గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల్లో ఇళ్లను కోల్పోతున్నామని, రహదారుల నిర్మాణంలో మార్పులు చేయాలని కోరారు. కొండవీటి ముంపు కారణంగా వచ్చే వరద నీటిని నిల్వ చేసేందుకు ఒక్కొక్క టిఎంసికి 23,600 ఎకరాలు కావాలని ఆ స్థలాన్ని ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలన్నారు. వరద ముంపు సమయంలో కృష్ణానదిలో నిండుగా నీరు ప్రవహిస్తుందని గ్రామాల్లో నీరు నదిలో కలిసే అవకాశం లేదన్నారు. మిగులు జలాలను రాష్ట్రాలు విభజించుకోగా కొత్త రాజధానికి మంచినీటి సరఫరా ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులు ప్రజారాజధానిలో భాగస్వాములని ముఖ్యమంత్రి చెప్పారని, ఇళ్ల నిర్మాణ సమయంలో యూజర్ చార్జీల నుండి రైతులకు మినహాయింపునివ్వాలన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల నుండి సలహాలు స్వీకరించిన అనంతరం రైతుల అభిప్రాయాలపై మళ్లీ సదస్సులు నిర్వహించి మాస్టర్‌ప్లాన్‌లో మార్పుల గురించి చెప్పాలన్నారు.

సిఆర్‌డిఎ అధికారులను ప్రశ్నిస్తున్న రాయపూడివాసులు