రాష్ట్రీయం

ఏర్పేడు వద్ద ఎస్‌ఐపై రాళ్లురువ్విన ఎర్ర కూలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, జనవరి 13 : చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ప్రాంతంలో లారీలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎర్రకూలీలు బుధవారం నాడు తెల్లవారి జామున చెలరేగిపోయారు. తమను వెంటాడుతున్న టాస్క్ఫోర్స్ బృందంపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఎస్సై వాసు గాయపడ్డాడు. ఎర్రచందనం దుంగలతో పారిపోవడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపి ఒక మెకానిక్ షాపును ఢీకొన్నాడు. ఈ సందర్భంగా 16 మంది కూలీలు పరారు కాగా ఆరుగురు కూలీలను కార్యాదళ సిబ్బంది వెంటబడి పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలతో ఓ లారీ వెంకటగిరి జాతీయ రహదారిపై వెళుతున్నదని సమాచారం రావడంతో కార్యాదళం సిబ్బంది వెంకటగిరి రోడ్ క్రాస్ వద్ద చెక్ పోస్టు వద్ద కాపు కాసారు. మదనపల్లికి చెందిన ఎ పి 0 వి 1160 లారీ బుధవారం తెల్లవారు జామున 4.45 గంటల ప్రాంతంలో అటుగా వచ్చింది. ఇది గమనించిన ఆర్ ఎస్ ఐ వాసు తన సిబ్బందితో లారీని నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే తెగించిన లారీ డ్రైవర్ శివకుమార్ వాహనాన్ని వేగంగా వారిపైకి నడిపారు. క్షణంలో పక్కకు తప్పుకున్న వాసు బృందం తమ జీపులో లారీని వెంటాడారు. ఈ క్రమంలో లారీలో ముందుగానే సిద్దంగా ఉంచుకున్న రాళ్లతో ఎర్రకూలీలు కార్యాదళం సిబ్బంది ప్రయాణిస్తున్న జీపుపైకి లారీ పైనుండే దాడి చేసారు. ఈ సందర్భంగా వాసుకు తలపై బలమైన గాయమయ్యింది. అయినా కూడా ఎర్రకూలీలు వెళుతున్న వాహనాన్ని వెంటడారు. ఈ విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్ శివకుమార్ వాహనాన్ని మరింత వేగంగా నిడిపి శ్రీకాళహస్తి వైపు మలుపు తిప్పాడు. ఈ సందర్భంగా లారీ అదుపు తప్పడంతో అక్కడ ఉన్న ద్విచక్రవాహనంపై నుండి దూసుకువెళ్ళి మెకానిక్ షాపును ఢీ కొని ఆగింది. పోలీసులు అక్కడికి చేరుకొనే లోపే లారీ డ్రైవరు శివకుమర్, 22 మంది ఎర్రకూలీలు పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన కార్యదళ సిబ్బంది ఇటు అడవులలోనూ, ఏర్పేడు వీధులలోనూ విస్తృతంగా గాలించారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సాధారణ ప్రజల్లా సంచరిస్తున్న తిరువణ్ణామలైకు చెందిన సి. మాణిక్యం, కె. మాణిక్యం, పి. గోవిందరాజులు, పి. దామోదరం, ఆర్ కుమార్, ఆర్ ప్రతాప్‌లను అనుమానించి పట్టుకోవడంతో వారే ఎర్ర కూలీలు అని విచారణలో తేలింది. ఇతర కూలీల కోసం టాస్క్‌పోర్స్ సిబ్బంది ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లారీలో సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 32 ఎర్రదుంగలతో పాటు నిత్యావసర వస్తువులు, బ్యాగులు ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ వాసు ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్నారు.