రాష్ట్రీయం

ఉద్యోగం కోసం భర్తను హత్య చేయించిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 13: ఉద్యోగం వస్తుందనే పేరాశతో భర్తను భార్య హత్య చేయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ హత్యకేసు విచారణ జరుపుతున్న సమయంలో ఈ హత్య కేసు బయటపడినట్లు ప్రకాశంజిల్లా మార్కాపురం డివైఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2009 ఆగస్టు 9న ఈసంఘటన జరిగినట్లు తెలిపారు. పెద్దారవీడు గ్రామానికి చెందిన కె శంకర్ అనే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ నంద్యాల ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుండేవాడని, ఈ సమయంలో పఠాన్ సుభానితో మృతుని భార్య కె సుభాషిణికి అక్రమ సంబంధం ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో భార్యను ఇబ్బంది పెడుతుండటంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకుంటే ఉద్యోగంతోపాటు పెన్షన్ కూడా వస్తుందని భావించి శంకర్ హత్యకు పథకం వేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ సంబంధం పెట్టుకున్న పఠాన్ సుభానికి విషయం తెలిపి 50వేల రూపాయలు డబ్బులు ఇవ్వగా అతని స్నేహితులైన తిరుమలశెట్టి వెంకటరమణ, కోలా రత్నకుమార్, షేక్ జాఫర్‌ను సంప్రదించి శంకర్ హత్యకు పథకం రచించారు. పెద్దారవీడులో ఉన్న శంకర్‌ను మంచిమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని దేవరాజుగట్టు ప్రాంతానికి తీసుకువచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బొడుచర్ల-మిట్టమీదిపల్లి మధ్య రైల్వేపట్టాలపై వేసినట్లు తెలిపారు. అప్పట్లో రైల్వేపోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదుచేశారని తెలిపారు. కాగా, మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో బాబాయిని హత్యచేసిన కేసులో పఠాన్ సుభాని అలియాస్ గద్ద అలియాస్ గద్దగాడు నిందితుడిగా ఉండటంతో ఆ కేసు విచారణ జరుపుతుండగా ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చిందని డివైఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. సుభాషిని భర్త మరణం ద్వారా వచ్చిన డబ్బులు, ఉద్యోగం చేసుకుంటూ కర్నూల్‌లో జీవనం సాగిస్తోంది. మొదటి నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్న పఠాన్ సుభానిని దూరంగా ఉంచడంతో ఈ హత్యకేసు విషయాన్ని పోలీసులకు తెలపడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్లైంది. పెద్దారవీడు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.