రాష్ట్రీయం

భృంగి వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం ఆది దంపతులకు భృంగివాహన సేవ నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు చేపట్టారు. ఆగమశాస్త్రానుసారం రుద్రహోమం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి భృంగివాహనంపై ఆశీనులనుజేసిన అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భృంగివాహనంపై ఆశీనులైన స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.