రాష్ట్రీయం

కడియం నర్సరీలో సంక్రాంతి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జనవరి 13: తెలుగింట సంక్రాంతి సందడి తెలిపేలా వివిధ రకాల మొక్కలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులతో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో విరివనం మురిసింది. గంగిరెద్దులు, భోగిమంటలు సంస్కృతిని చాటే ఆకృతులను రూపుదిద్దుతూ వేలాది మొక్కలతో తీర్చిదిద్దిన ఆకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ల్యాండ్ స్కేపింగ్‌లో విడివిడిగా ఉపయోగించే మొక్కలను మాత్రమే ఉపయోగించి ఈ ఆకృతులు తీర్చిదిద్దడం విశేషం. మెడలో గంట ధరించిన గంగిరెద్దు, ఆ గంగిరెద్దును ఆడించే కళాకారుడు, చెరకు గడ పట్టిన లక్ష్మీదేవి, ఎర్రని నిప్పులు చిందే భోగి మంటలు, కలశం ఆద్యంతం సృజనాత్మకతను చాటింది ఈ రూపం. పల్ల వెంకన్న నర్సరీలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా సందర్శకుల కోసం ఈ ఆకృతులు తీర్చిదిద్దారు.