రాష్ట్రీయం

పట్టాలెక్కని పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: గత దసరా పండుగ రోజున ఆగమేఘాలపై ప్రారంభమైన కొత్త జిల్లాలు మళ్లీ దసరా పండుగ సమీపిస్తున్నా ఇంకా గాడిలో పడలేదు. కొత్త జిల్లాల్లో పాలన ఇంకా పట్టాలు ఎక్కలేదు. వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాలన్నీ పూర్తిస్థాయి జిల్లాలుగా రూపాంతరం చెందుతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కడ కూడా కొత్త జిల్లాలు కొత్త కార్యాలయాల్లోకి మారడం కానీ, పూర్తిస్థాయి సిబ్బంది నియామకం కానీ జరుగలేదు. ఏ జిల్లాలో కూడా కొత్త కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాలేదు. చాలాచోట్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొత్త జిల్లాలకు నియమించిన ఉద్యోగులు, సిబ్బంది కూడా ఇంకా తాత్కాలిక నియామకాలతోనే కొనసాగుతున్నారు. వర్క్ టు ఆర్డర్ ఉత్తర్వుల మేరకు నియామకం అయిన ఉద్యోగులు మాత్రమే కొత్త జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక ఉత్తర్వులతో కొనసాగే ఉద్యోగుల స్థానంలో రెండు మూడు నెలల్లోనే కౌన్సిలింగ్ నిర్వహించి పూర్తిస్థాయి నియమకాలు జరుపుతామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఏడాది గడిచినా ఆ హామీ నెరవేరలేదు. ఉద్యోగుల నియామకానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ల జారీకే పరిమితం కావడం తప్ప నియామకాలను చేపట్టనే లేదు. దీనికి తోడు జోనల్ వ్యవస్థ రద్దు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇది తేలే వరకు కొత్త జిల్లాలకు పూర్తిస్థాయి ఉద్యోగుల కేటాయింపు సాధ్యం కాదని ఇటీవల ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సందర్భంగా స్పష్టం చేసినట్టు వారు మీడియాకు తెలిపారు. కొత్త జిల్లాలతో ఇది వరకటి పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ సమీకృత కార్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త భవనాల నిర్మాణం కోసం అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందినప్పటికీ ఎక్కడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ప్రభుత్వ ఐటిఐలో కొనసాగుతుంది. తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఐటిఐకి చెందిన అధికారులు నోటిసు ఇచ్చినట్టు సమాచారం. సిరిసిల్లలో విద్యుత్ కార్యాలయంలో కలెక్టరేట్, బాలికల పాఠశాలలో ఎస్పీ కార్యాలయం కొనసాగుతుంది. ఈ రెండింటిని ఒకే చోట బైపాస్ రోడ్‌లో నిర్మించడానికి 96 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేసినప్పటికీ నిర్మాణం మొదలు కాలేదు. జగిత్యాలలో పంచాయతీరాజ్ ఇఇ కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయం కొనసాగుతుంది. ధరూర్ వద్ద కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి స్థల ఎంపిక జరిగినప్పటికీ ఇంకా కార్యాచరణ ప్రారంభం కాలేదు. వరంగల్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలతో పాటు మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లిగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. పాత జిల్లా కలెక్టరేట్‌లో అర్బన్ కలెక్టరేట్ యథావిధిగా కొనసాగుతుండగా, రూరల్ జిల్లా కలెక్టరేట్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో కొనసాగుతుంది. రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడో ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. జనగామలో పాత మున్సిపల్ కార్యాలయంలో కలెక్టరేట్ కొనసాగుతోంది. సూర్యాపేట రోడ్‌లో నిర్మించడానికి స్థలాన్ని ఎంపిక చేసారు తప్ప పనులు ప్రారంభం కాలేదు. మహబూబాబాద్‌లో కలక్టర్ కార్యాలయం తాత్కాలికంగా ఐటిడిఎ కార్యాలయంలో కొనసాగుతుంది. కురవి రోడ్‌లో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 38 ఎకరాలను ఎంపిక చేశారు కానీ, ఇది అసైన్డ్ ల్యాండ్ అని కొత్త వివాదం తలెత్తింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మేడ్చెల్, వికారాబాద్ జిల్లాలు ఏర్పాటు కాగా వికారాబాద్‌లో ఆర్డీవో కార్యాలయంలో, మేడ్చెల్ కలెక్టరేట్ కీసరలో ప్రైవేట్ కాలేజీలో కొనసాగుతుండగా, పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రస్తుత భవనంలోనే కొనసాగుతుంది. కొత్తగా నిర్మించే కార్యాలయాన్ని శంషాబాద్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి పట్టుబడుతుండగా, మహేశ్వరం, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యేలు దీనిని మైలార్‌దేవ్‌పల్లిలో నిర్మించాలని పట్టుబడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా ఇవీ కూడా ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయాలలోనే కొనసాగుతున్నాయి తప్ప కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.