రాష్ట్రీయం

రాష్ట్రంలో జీనోమ్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: వైద్య రంగంలో మరో సరికొత్త ఆవిష్కరణలకు శాస్తవ్రేత్తలు సిద్ధమవుతున్నారు. మానవుల డిఎన్‌ఎ మ్యాపింగ్ ద్వారా వారికి సరిపడే (డోస్) మందులు ఇచ్చే రోజులు త్వరలో రానున్నాయని సిసిఎంబి మాజీ సంచాలకుడు పద్మశ్రీ డాక్టర్ లాల్జీసింగ్ చెప్పారు. గురువారం నాడు ఆయన హిట్స్ విద్యాసంస్థల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో జన్యుపరమైన వ్యాధుల నివారణ- నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, కేంద్ర శాస్తవ్రిజ్ఞాన శాఖ ఉపకరణాల కొనుగోలుకు నిధులు సమకూర్చిందన్నారు. ఈ కేంద్రం ద్వారా వైయక్తికంగా జన్యు విశే్లషణలు చేసి, జన్యువైద్యం సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురాగలుగుతామని చెప్పారు. మానవుల జన్యు పట్టిక తయారీ ఖర్చులు సైతం క్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. దీంతో డిఎన్‌ఎ ఆధారంగా వ్యాధుల చికిత్స త్వరలోనే సాకారం అవుతుందని, విస్తృత జీవ వైవిధ్యం ఉన్న భారత్‌లో జన్యు పరిశోధనలకు అద్భుతమైన అవకాశం ఉందని అన్నారు.
జన్యువు అంటే క్రోమోజోమ్‌లలో ఉండే డిఎన్‌ఎ పోగులో కొంత భాగం, నిర్దిష్ట ప్రోటీన్‌లు తయారుచేసేందుకు అవసరమైన సమాచారం జన్యువుల్లో ఉంటుందని ఆయన వివరించారు. ఏ ప్రోటీన్ ఏ సమయంలో తయారుకావాలో తెలిపే సమాచారం కూడా జన్యువుల్లో ఉంటుందని అన్నారు.