రాష్ట్రీయం

అందరూ నిర్దోషులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: హైదరాబాద్ బేగంపేట టాస్క్ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడి కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులపై ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోవటంతో వారిపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా, 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరిలో ముగ్గురు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కోర్టు తీర్పును డిఫెన్స్ లాయర్ స్వాగతించారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపలేదని, దీంతో తమ క్లయింట్లను నిర్దోషులుగా కోర్టు తేల్చిందన్నారు. నిందితుల్లో కొందరు 11ఏళ్లుగా జైలులో ఉన్నారు. మరికొందరు ఏడేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. తీర్పు పూర్తి పాఠం చదివిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని అన్నారు. 2005 అక్టోబర్ 12న బేగంపేటలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై
మానవ బాంబు పేలిన సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, గురువారం వెలువడిన కోర్టు తీర్పుపై డిసిపి అవినాష్ మహంతి విలేఖరులతో మాట్లాడుతూ, నాంపల్లి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు.
12ఏళ్లపాటు విచారణ సాగిందిలా..
బేగంపేట టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవ బాంబు పేలుడు కేసు 12 ఏళ్లపాటు విచారణ సాగింది. 10మంది నిందితులపై 2006లో చార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు పాకిస్తాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. 2005అక్టోబర్ 12న జరిగిన దుర్ఘటనను హర్కతుల్ జిహాద్ ఇస్లామిక్ బంగ్లాదేశ్ సంస్థగా పనిగా సిట్ నిర్ధారించింది. మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ మానవ బాంబును
టాస్క్ఫోర్స్ ఆఫీసుకు తీసుకువచ్చాడు. ఉగ్రవాదులకు లాజిస్టిక్ సపోర్ట్ చేసింది మహమ్మద్ అబ్దుల్ జాహెద్, పేలుడు పదార్థాలను అందజేసింది మహమ్మద్ షకీల్‌గా సిట్ గుర్తించింది. జైషె ఉగ్రవాది మహమ్మద్ ఉగ్రవాది అలీఖాన్ వీరికి బీదర్‌లో స్థావరం ఏర్పాటు చేశాడు. అజ్మత్ అలీ ఇంట్లో బాంబులు తయారీ, సరఫరా జరిగిందని సిట్ అధికారులు నిర్ధరించారు. నిశిత దర్యాప్తు అనంతరం వీరిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది.
ఇన్నాళ్లు జైల్లో ఉన్నవారికి ఏం చెబుతారు: అసదుద్దీన్
బేగంపేట టాస్క్ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడి కేసులో కోర్టు తీర్పుపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 10 మంది నిందితులపై కేసులు పెట్టి పదకొండేళ్లు జైల్లో పెట్టారంటూ పోలీసులపై ఆయన మండి పడ్డారు. కేసును కోర్టు కొట్టివేసిందని, ఇన్నాళ్లు జైల్లో ఉన్న వారికి ఏం సమాధానం చెబుతారని అసదుద్దీన్ ప్రశ్నించారు. దీనికి దర్యాప్తు చేసిన వారే బాధ్యత వహించాలని అన్నారు. ఘటనాస్థలంలో సేకరించిన పేలుడు పదార్థానికి, పోలీసులు కోర్టుకు అందజేసిన పేలుడు పదార్థానికి మ్యాచ్ కాలేదన్నారు. ఈ కేసులో అడ్వకేట్ల బృందానికి అసదుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. బందోబస్తుతో కోర్టుకు హాజరైన నిందితులు