రాష్ట్రీయం

రెవెన్యూ గొంతుకు భూముల ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 11: విశాఖ భూ కుంభకోణంలో రెవెన్యూ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విశాఖ భూకుంభకోణంపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకుంది. అనకాపల్లి ఎమ్మెల్యేపైనా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇద్దరు తహశీల్దార్లను విచారించి అక్రమాలకు పాల్పడ్డారని నిర్థారణకు రావడంతో, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రామవరం, మధురవాడ, ఆనందపురం తదితర ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా, ఆయా సమయాల్లో పనిచేస్తున్న తహశీల్దార్లు పట్టించుకోలేదు. కేవలం ఈ అంశంపైనే సిట్‌కు 300కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని ఒక్కటొక్కటిగా విచారిస్తున్న సిట్ అధికారుల ముందు 20మంది తహశీల్దార్ల వ్యవహారాలు వెలుగు చూశాయి. అలాగే కుంభకోణంలో అక్రమార్కులకు ఆరుగురు విఆర్వోలు సహకరించారని నిర్థారణకు వచ్చారు. దీంతో వీరందరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న తహశీల్దార్లలో ఏడు, ఎనిమిది మంది పదవీ విరమణ చేశారు. అయితే వీరు కూడా విచారణకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ విషయమై సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్ శుక్రవారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ నోటీసులు అందుకున్న తహశీల్దార్ల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేస్తున్నామన్నారు. వీరు తమ హయాంలో ప్రభుత్వ భూముల రికార్డుల టాంపరింగ్, కబ్జాదారులకు సహకరించడం వంటి అనేక అవకతవకలకు పాల్పడినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఆయా మండలాల్లోని ప్రభుత్వ భూమల అన్యాక్రాంతం, రికార్డుల తారుమారు వంటి అంశాలపై అందిన ఫిర్యాదులను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లకు పంపించారు. ఓపక్క నోటీసులు అందుకున్న తహశీల్దార్లను విచారిస్తునే, ప్రస్తుత తహశీల్దార్ల నుంచి వచ్చే నివేదికను కూడా బేరీజు వేసుకుని, వీరిపై నేర నిర్థారణ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఆనందపురం మండలం రామవరంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన విషయం తెలిసినా, సరైన చర్యలు తీసుకోలేదన్న అభియోగంపై విచారణ జరపనున్నారు.