రాష్ట్రీయం

వాన నీటి చౌర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వర్షాకాలం సీజన్ సగం గడచినా ఇంతవరకు 3 టిఎంసి మించి వరద నీరు రాలేదు. దీనికి కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం నిర్మించడం ఒక్కటే కారణం కాదని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా బేసిన్‌లో కృష్ణా నదితోపాటు నదిలో కలిసే అనేక వాగులు, వంకలు, చిన్న ఉప నదులపై లెక్కలేనన్ని సంఖ్యలో చెక్‌డ్యాంలు, నీటి మళ్లింపు పథకాలు, కేంద్రం పరిధిలోకిరాని చిన్న పథకాలను భారీగా నిర్మించడమే అసలు కారణమని బలంగా చెబుతున్నారు. కేంద్రం అనుమతులు అవసరం లేకుండా నిర్మించుకున్న చిన్న చిన్న పథకాల ద్వారా ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పడుతూ, నదికి చేరుకుండానే అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అంతర్గతంగా కృష్ణా బేసిన్‌లో పడిన వర్షం నీరు నది వరకూ ప్రవహించడం లేదు. అంటే, మళ్లింపు చెక్‌డ్యాంల ద్వారా వాననీరు నదికి చేరకుండా నిరోధిస్తున్నారన్న మాట. జూలై నెలాఖరు నాటికి ఆల్మట్టి నిండింది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు నిలిచిపోయాయి. మహారాష్టల్రో కురిసిన వర్షాలకు ఆల్మట్టిలోనికి భారీ వరద నీరు చేరింది. తర్వాత ఆల్మట్టి డ్యాం గేట్లను ఇంతవరకు తెరవలేదు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో కృష్ణా బేసిన్‌లో వాగులు, వంకలపైన కొల్హాపూర్ టైప్ నీటిని నిలువరించే పథకాలను నిర్మించాయి.
తక్కువ నిధులతో వాగులు, వంకలపైన ఈ స్కీంలను నిర్మిస్తారు. గత రెండు దశాబ్దాలుగా కొల్హాపూర్ టైప్ స్కీంలను ఈ రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్నాయి. ఈ నిర్మాణాలకు కేంద్రం అనుమతులు అక్కర్లేదు. దీనివల్ల ఏమేరకు నీటిని ఈ రాష్ట్రాలు వాడుకుంటున్నాయి అనే విషయమై కేంద్ర జల సంఘం వద్ద లెక్కలు లేవు. బచావత్ అవార్డు ప్రకారం నిర్దేశించిన నీటికంటే ఎక్కువగానే కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మహారాష్టల్రోనే దాదాపు 25 వేలకు పైగా కొల్హాపూర్ టైప్ చెక్ డ్యాంలు, నీటి పథకాలను వివిధ వాగులు, వంకలపై నిర్మించారు. దాదాపు 150 టిఎంసి నీటిని ఈ పథకాలు నిల్వ చేస్తున్నాయని సాగునీటి ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇక లెక్కలోకిరాని బ్యారేజీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వం నారాయణపూర్ దిగువున గిరిజాపూర్ బ్యారేజీని జూరాల ఎగువున నిర్మించింది. దీనివల్ల జూరాలకు నీటి ప్రవాహం ఆశించిన స్ధాయిలో చేరడం లేదు.
ఆల్మట్టి డ్యాం వల్లనే తెలంగాణ, ఏపి ప్రాజెక్టులకు నీరు రావడం లేదని అనుకోరాదని, ఎగువ రాష్ట్రాలు కృష్ణా బేసిన్‌లో నిర్మించిన వందల సంఖ్యలో చెక్ డ్యాంలు, సాగునీటి అవసరాలకు మళ్లింపు పథకాలను నిర్మించడం తెలుగు రాష్ట్రాలకు శాపంగా మారిందని సాగునీటి ఇంజనీర్లు చెబుతున్నారు. ఆగస్టు నెల రెండోవారం ముగుస్తున్నా ఇంకా రాష్ట్రంలో కృష్ణా రిజర్వాయర్లలో 590 టిఎంసి నీటి నిల్వలు ఉండాల్సిన పరిస్థితి పోయి కేవలం 135 టిఎంసి మాత్రమే ఉన్నాయి.