రాష్ట్రీయం

ముందుచూపు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: కోటి జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి పదేళ్ల ప్రణాళికతో వౌలిక సదుపాయాల కల్పన జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో 30ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా ప్రణాళిక ఉండాలన్నారు. మహానగర మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన 10 టిఎంసి నీటి నిలువ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ఇందు లో ఒకదానికి గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మరోదానికి కృష్ణా నదిపై నిర్మించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి నీటిని నింపడానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం మున్సిపల్ మంత్రి కె తారకరామారావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ ఉన్నతాధికారులతో సిఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు జనాభా కూడా ఇప్పటికే కోటి దాటిపోవడంతో 30ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పదేళ్ల ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు.
నగరానికి శాశ్వత ప్రాతిపదికన మంచినీటి సరఫరా కోసం రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. పూర్తి గ్రావిటి ఆధారంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా ఈ రిజర్వాయర్లను నింపాలని నిర్ణయించారు. నగరం ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడంతో నగరం చుట్టూరా ఉన్న వేలాది అటవీ భూములలో విస్తృతంగా చెట్లు పెంచాలి. ఢిల్లీ మాదిరిగా నగరాన్ని హరితమయంగా మార్చాలి. నాగోల్, నారపల్లి ప్రాంతాలలో ఎనిమిది వేల ఎకరాల అటవీ భూమిలో, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్‌కు అవతల 16 వేల ఎకరాల అటవీ భూమిలో, అలాగే నర్సాపూర్, శివంపేట ప్రాంతాల్లోని 40 వేల ఎకరాల అటవీ భూమిలో చెట్లు పెంచాలి. నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షణకు ఐఎఫ్‌ఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలి. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి బస్తీ కమిటీలు వేయాలి. ప్రతీ డివిజన్‌కు 10 కమిటీలను 15 రోజులలో నియమించాలి. గండిపేట, హిమాయత్‌సాగర్, శామీర్‌పేటతో పాటు నగరంలో, నగర పొలిమేర్లలోని చెరువులలో పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యం చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో కొత్తగా నిర్మించే నిర్మాణాలకు కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలి. అనుమతులు ఇచ్చే సందర్భంలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. సబర్మతి నది రివర్ ఫ్రంట్ తరహాలో మూసీనది సుందరీకరించాలి. మూసీ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు రహదారి నిర్మించాలి. నదికి ఇరువైపువ ఉద్యాన వనాలు అభివృద్ధి చేయాలి. నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు ఇళ్లపై తీగలను తొలగించాలి. ఉప్పల్‌లాంటి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అండర్ పాస్‌లు నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం.. హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై మంత్రులు, ఉన్నతాధికార్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్