రాష్ట్రీయం

అక్కడలా.. ఇక్కడిలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: ఆంధ్ర రాష్ట్రంలో సాధారణానికి దగ్గరగానే వర్షపాతం నమోదైనా, సేద్యంలో మాత్రం విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. తెలంగాణ ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైనా, కలిసొచ్చిన కాలంతో ఖరీఫ్ గండం గట్టేక్కే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణం అనుకూలించినా లక్ష్యానికి చేరువకాలేని పరిస్థితిలో ఆంధ్ర కనిపిస్తుంటే, వర్షాభావం వెంటాడుతున్నా ఖరీఫ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇదే ఈ సీజన్‌లో కనిపించే వైవిధ్యమైన దృశ్యం.
నిజానికి ఈ సీజన్‌లో తెలంగాణ అధిక వర్షాభావానే్న ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ భూగర్భ జలాల సాయంతో సాగు ఇబ్బందులను అధిగమించి, ఖరీఫ్ లక్ష్యానికి దగ్గరకు చేరింది. ఆంధ్రలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, సగానికి సగం విస్తీర్ణం సాగుకు నోచుకోలేదు. తెలంగాణలో 11 జిల్లాల్లో వర్షపాతం లోటు కనిపిస్తుంటే, ఆంధ్రలో అనంతపురం జిల్లా మాత్రమే ఈరోజు వరకు వర్షాభావ ప్రాంతంగా నమోదైంది. అయితే, కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఖాళీ అయిపోవడంతో రెండు రాష్ట్రాల్లో సాగర్ ఆయకట్టు బోరుమంటోంది. ఆంధ్రలో పట్టిసీమ గోదావరి జలాలతోనే ఈసారి కృష్ణా డెల్టా బతికి బట్టకట్టింది. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల భూగర్భ జలాలను తోడి ఖరీఫ్ సాగు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల రోజుల్లో ఆశించిన స్ధాయిలో వర్షాలు కురవని పక్షంలో, కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లకు వరదనీరు రాకపోతే కరవు కోరల్లోకి జారుకునే అవకాశాలు లేకపోలేదు.
తెలంగాణలో...
తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. వర్షాకాలం ప్రారంభమై 60 రోజులు గడచింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 439.5 ఎంఎం నమోదుకావాల్సి ఉండగా, -12.5 శాతంతో 384.5 ఎంఎం వర్షపాతం నమోదైంది. మంచి వర్షాలు కురుస్తాయనే ఆశతో పెద్ద ఎత్తున ఖరీఫ్ సాగు చేస్తున్న రైతుల్లో నైరాశ్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 7 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. కర్నాటక ప్రభుత్వం 15 టిఎంసి నీటిని వదిలితే కనీసం మంచినీటికి ఉపయోగపడుతాయని ప్రభుత్వం రాసిన లేఖకు కర్నాటక నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా నెలకొన్న పరిస్ధితిని విశే్లషిస్తే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, సిరిసిల్ల, మెదక్, వరంగల్ అర్బన్‌లో వర్షపాతం లోటు పెరిగింది. ఈ 11 జిల్లాల్లో -20నుంచి -59 శాతానికి వర్షపాతంలోటు పెరిగింది. మూడు జిల్లాలు జోగుళాంబ, మేడ్చెల్- మల్కాజగిరి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 20శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. భద్రాద్రి, మహబూబాబాద్, వరంగంల్ రూరల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, వనపర్తి, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 584 మండలాల్లో 213 మండలాల్లో -59శాతం వర్షపాతం లోటుగా, 258 మండలాల్లో సాధారణ వర్షపాతం, 111 మండలాల్లో 20శాతం అధికంగా, రెండు మండలాల్లో పూర్తిగా తక్కువగా వర్షపాతం నమోదైనట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో 31 జిల్లాల్లో 43.24 లక్షల హెక్టార్లకు 34.42 లక్షల హెక్టార్లలో సాగు కిందకు వచ్చింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 31.39 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఆహార ధాన్యాల్లో 5.93 లక్షల హెక్టార్లకు 4.87 లక్షల హెక్టార్లు, పప్పు్ధన్యాల్లో 19.48 లక్షల హెక్టార్లకు 13.33 లక్షల హెక్టార్లు, నూనె గింజల్లో 3.25 లక్షల హెక్టార్లకు 2.01 లక్షల హెక్టార్లు, పత్తి పంట 16.76 లక్షల హెక్టార్లకు 17.84 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పత్తి రికార్డుస్థాయిలో అంటే 106 శాతం ఎక్కువగా సాగుచేస్తున్నారు.
ఆంధ్రలో..
ఆంధ్రలో మొత్తం 310.4 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇంతవరకు 291 మిమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా -19 శాతం వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తంమీద ఈ సీజన్‌లో 42,06,686 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంతవరకు 23,93,710 లక్షల హెక్టార్లలో సాగు పరిధిలోనికి వచ్చింది. రాష్ట్రం మొత్తంపైన తూర్పుగోదావరి జిల్లాలో 26 లక్షల హెక్టార్లకు 17 లక్షల హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 26.1 లక్షల హెక్టార్లకు 20 లక్షల హెక్టార్లలో, కృష్ణా జిల్లాలో 33 లక్షల హెక్టార్లకు 17.35 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఇవ్వడం వల్ల కృష్ణా జిల్లాలో ఖరీఫ్ బాగా సాగుతోంది. కాగా నెల్లూరు జిల్లాలో 50 శాతం, కడప జిల్లాలో 34 శాతం, అనంతపురం జిల్లాలో 32 శాతం, కర్నూలు జిల్లాలో 58 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 49 శాతం, విజయనగరం జిల్లాలో 32 శాతం, విశాఖపట్నం జిల్లాలో 35 శాతం, గుంటూరు జిల్లాలవో 43 శాతం, ప్రకాశం జిల్లాలో 31 శాతం మాత్రమే సాగులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంపైన 343 మండలాల్లో సాధారణ వర్షపాతం, 193 మండలాల్లో వర్షపాతం లోటుగా, 34 మండలాల్లో అదనంగా వర్షపాతం నమోదైంది.