రాష్ట్రీయం

బాబు వస్తే.. నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 12: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, హామీలు ఇచ్చి నెరవేర్చని చంద్రబాబును నిలదీయాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గోస్పాడు మండలం యాళ్లూరు, ఎం.కృష్ణాపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ హామీలు నెరవేర్చని వ్యక్తిని ఏం చేసినా తప్పులేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సిఎంను ప్రజలు గట్టిగా అడగాలన్నారు. ఉప ఎన్నికల కోసం చంద్రబాబు, మంత్రులు నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 21 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా
కొనుగోలు చేసిన చంద్రబాబు వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. రైతుల రుణమాఫి పూర్తి చేయలేదని, డ్వాక్రా మహిళలకు మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. నంద్యాలలో ఇటీవల చంద్రబాబు పర్యటించిన సమయంలో మోహన్ అనే రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే మైక్ లాక్కొని పంపించడమేగాక, బెదిరింపులకు గురి చేశారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశానని రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేశాడన్నారు. సీమ ప్రాంతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తానని, ప్రాజెక్టు వద్ద నిద్ర నటించిన చంద్రబాబు మూడేళ్లుగా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాడని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును ఉరి తీసినా తప్పులేదని జగన్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు పేదలను సైతం వదిలిపెట్టలేదని, ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చి మూడున్నరేళ్లలో ఒక్క ఇళ్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. నంద్యాల ప్రజలు వేసే ఓటు వచ్చే ఏడాదిలో జరిగే కురుక్షేత్రానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

చిత్రం.. నంద్యాల ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న జగన్