తెలంగాణ

దక్షిణాది రాష్ట్రాలలో 31చేనేత క్లస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 13: చేనేత వస్త్రాల నాణ్యతను పెంచేందుకు దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో రూ.62 కోట్లతో 31 చేనేత క్లస్టర్లను ఏర్పా టు చేయనున్నట్లు జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. చేనేత సంఘాన్ని సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేత వస్త్రాల తయారీ, మార్కెటింగ్ సౌకర్యం తదితర సమాచారాన్ని తెలుసుకున్నారు. చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించి మగ్గాలను పరిశీలించారు. రంగుల అద్దకం, చేనేత ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. వస్త్రాల తయారీతో కార్మికులకు లభిస్తున్న ధరల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. చేనేత వస్త్రాల నాణ్యతను పెంచి వినియోగదారుల్లో భరోసా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించేందుకు తరుచుగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఒక్కో క్లస్టర్‌కు రూ.2 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఆలేరు, గుండాల, కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, హుజూరాబాద్‌లో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
మగ్గాలను పరిశీలిస్తున్న జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్