రాష్ట్రీయం

హామీతో అగచాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 14: సిఎం చంద్రబాబు మానస పుత్రిక పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రకటించినట్టే మంగళవారం ప్రారంభమవుతోంది. రికార్డుస్థాయిలో తొమ్మిది నెలల కాలంలో పథకం పూర్తిచేసి ఆగస్టు 15న ప్రారంభిస్తామని సిఎం ఇచ్చిన హామీని నిజం చేయడానికి జలవనరుల శాఖ అధికారులు భగీరథ ప్రయత్నం చేశారు. మొత్తంమీద మంగళవారం పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే దాదాపు అన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే ప్రారంభోత్సవం జరుగుతున్నందున, ఇది తాత్కాలికమేనన్న వాదన వినిపిస్తోంది. పథకం ఒక ఎత్తయితే, వరుణుడు కరుణిస్తేనే ప్రారంభోత్సవం సజావుగా సాగుతుందన్నది రెండో అంశం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం ఎడమ కాల్వలోకి తోడతారు. అక్కడ నుంచి 58 కిలోమీటర్ల వరకూ నీటిని తీసుకెళ్ళి, అక్కడ మరో పంపుహౌస్ ద్వారా ఎత్తిపోస్తారు. 13.12 కిలోమీటర్లు దూరానికి పైపులైన్ ద్వారా తరలించి అక్కడ నుంచి నేరుగా ఏలేరు రిజర్వాయర్‌లో గోదావరి జలాలను కలుపుతారు. ఇదీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనితీరు. అయితే సిఎం విధించిన గడువు ఆగస్టు 15నాటికి పనులు పూర్తిచేసి ఏలేరుకు గోదావరి జలాలను అందించడానికి సమయం సరిపోనందున అధికార యంత్రాంగం పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. పైపులైన్లు, పంపులు, విద్యుత్
అన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే చివరకు పోలవరం ప్రధాన కాల్వకు సైతం ప్రత్నామ్నాయంగా తాత్కాలికంగా పుష్కర ప్రధాన కాల్వద్వారా నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన పంపుహౌస్ నుంచి 10.11 కిలోమీటర్ల మేర పైపుల ద్వారా నీటిని తీసుకెళ్ళి నేలకోటవద్ద నిర్మించిన డిశ్చార్జి పాయింట్ నుంచి పోలవరం కాల్వలోకి జలాలను విడుదల చేయాల్సివుంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 1.60 కిలోమీటర్ల వద్ద నీటిని విడిచిపెట్టి, రెండో దశలో 58 కిలోమీటర్ల వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాల్వనుంచి 1400 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు రిజర్వాయర్‌లోకి మళ్ళించడం ఈ పథకం లక్ష్యం. అయితే నేలకోట వద్ద నిర్మించిన డిశ్చార్జి పాయింట్ నుంచి పురుషోత్తపట్నం జలాలు పోలవరం కాలువలోకి 1.60 కిలోమీటర్ల వద్ద మళ్లనున్నాయి. అదే ప్రాంతంలో పోలవరం, పుష్కర కాల్వలు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు పథకాల రెగ్యులేటర్లూ నిర్మాణ దశలోనే వున్నాయి. ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రధాన కాల్వలకు నీటిని ఇక్కడే నియంత్రించాల్సి ఉంది. అయితే పోలవరం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ పనులు జోరుగా జరుగుతున్నాయి. దీంతో కాంక్రీటు పనుల నిమిత్తం గట్టువేశారు. దీనినిబట్టి పోలవరం కాలువలోకి 1.6 కిలోమీటర్ల వద్ద పురుషోత్తపట్నం జలాలు ప్రవేశించడానికి అవకాశంలేదు. ఆ పక్కనే వున్న పుష్కర ఏకైక ప్రధాన కాలువలోకి పురుషోత్తపట్నం పథకం ద్వారా వచ్చిన జలాలను మళ్లించాల్సి ఉంది. పోలవరం రెగ్యులేటర్ పనులు జరుగుతున్నాయి కాబట్టి అటుగా పురుషోత్తపట్నం నీరు వెళ్లడానికి అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా పుష్కర కాలువలోకే ప్రవాహం మళ్ళాల్సివుంది. అక్కడ నుంచి సమాంతరంగా నిర్మించిన పోలవరం, పుష్కర కాలువ ద్వారా 58 కిలోమీటరు వరకు వచ్చి అక్కడ పుష్కర కాలువ ద్వారా పోలవరం కాలువలోకి మళ్ళి, అక్కడ నుంచి స్టేజ్ 2 పంపుహౌస్ ద్వారా కొద్దిదూరం ప్రెజర్ మెయిన్ ద్వారా వెళ్ళి, అక్కడ నుంచి నేరుగా ఏలేరులో కలపాలి. ఏదేమైనప్పటికీ పోలవరం కాలువ పేరుతో పురుషోత్తపట్నం పథకం నీరు పుష్కర కాలువ ద్వారా ఏలేరుకు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆదరాబాదరా పూర్తయిన పనులతో పురుషోత్తపట్నం పథకం గోదావరి జలాలు పుష్కర కాలువ ద్వారానే ఏలేరుకు చేరే అవకాశం ఉందని కచ్చితంగా తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన ట్రయల్ రన్ సోమవారం అర్థరాత్రికి పూర్తిచేస్తారని సమాచారం.

చిత్రం.. పోలవరం ఎడమ ప్రధాన కాల్వపై రెగ్యులేటర్ నిర్మాణంలో ఉన్న కారణంగా
ప్రత్యామ్నాయంగా ఉపయోగించనున్న పుష్కర కాల్వ