రాష్ట్రీయం

సొంతంగానే ఐటిఐఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: కేంద్రంతో సంబంధం లేకుండా సొంతంగానే ఐటిఐఆర్ ప్రాజెక్టు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. యూపీఏ ప్రభుత్వం మంజూరుచేసిన ప్రాజెక్టుపై ఎన్టీయే ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం వల్ల కేంద్రం అందించే సహాయంపై ఆశలొదులుకుని సొంతంగానే ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఐటిఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రానికి ఒకవైపు లేఖ రాస్తూనే, మరోవైపు ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కమిటీ సమావేశమై వౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చవుతుందో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వానికి భూమి అందుబాటులో ఉన్నందున, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు కేంద్ర సహకారం అందితే సరే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు కొనసాగించాలని నిర్ణయించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమేం చేయాలో వివరించింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి సారథ్యం వహించే కమిటీలో ట్రాన్స్‌కో సిఎం, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి, టిఎస్‌ఐఐసి విసి, ఎండి, హెచ్‌ఎండిఏ కమిషనర్, సంబంధిత పోలీసు కమిషనరేట్లు సభ్యులుగా ఉంటారు. ఐటి రంగం అభివృద్ధికి వీరు పలు సూచనలు చేస్తారు. యూపీఏ ప్రభుత్వం చివరి దశలో ఐటిఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు మంజూరు చేసింది. దీంతో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, లక్షల మందికి ఐటి రంగంలో ఉపాధి లభిస్తుందని కేంద్రం నివేదికలో పేర్కొంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం ఐటిఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేయడంతో తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేకపోవడం వల్లే కేంద్రం ఐటిఐఆర్ మంజూరు చేసిందని సీమాంధ్ర నేతలు భావించారు. అయితే ఉద్యమానికి సంబంధం లేకుండా ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని కేంద్రం వివరించింది.
తెలంగాణ ఆవిర్భావం తరువాత ఐటిఐఆర్ ప్రాజెక్టుపై ఎన్డీయే ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఐటిఐఆర్ ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వమే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి దత్తాత్రేయ గత ఏడాది ప్రకటించారు. దాంతో కెటిఆర్ వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను బండారు దత్తాత్రేయకు అందించారు. ఏడాది గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. నాలుగేళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో, ఇక సొంతంగానే ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే చివరగా ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ కెటిఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అయితే, కేంద్రం నుంచి స్పందన వచ్చే అవకాశం లేదనే ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం స్పందించకున్నా, ఐటిఐఆర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.
అదే సమయంలో ఖమ్మం, వరంగల్ వంటి రెండో శ్రేణి నగరాల్లో సైతం ఐటి పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఖమ్మంలో రూరల్ టి.హబ్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్‌లో చిన్న తరహా ఐటి కంపెనీలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక రాయితీలు ఇవ్వడం ద్వారా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. వరంగల్‌లో టాస్క్‌ను ఏర్పాటు చేసి నైపుణ్యం కల వారికోసం శిక్షణ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో 20 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, నిట్‌తో పాటు పలు విద్యా సంస్థలున్నాయి. 30 వేలమంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. టాస్క్ ఏర్పాటువల్ల వీరికి ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటిని కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా రెండో శ్రేణి నగరాలకు విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉపాధి లభించడంతో పాటు హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.