రాష్ట్రీయం

దళితులపై దాడులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ‘దళితులపై దాడులు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. నేరెళ్ళలో పోలీసుల చర్య దారుణం, అమానుషం’ అంటూ అఖిలపక్ష నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రతిపక్షాల నేతలు రాజ్‌భవన్‌కు వెళ్ళి ఈమేరకు వినతి పత్రం అందించారు. సిరిసిల్లలోని నేరెళ్ళ ఘటనపై గవర్నర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని విమర్శించారు. ఖమ్మంలో పోలీసులు రైతులకు బేడీలు వేయడం, సిరిసిల్లలో ఇసుక మాఫియాకు అండగా నిలబడి దళితులపట్ల అమానుషంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆ జిల్లా ఎస్పీపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ప్రోత్సాహంతోనే నేరెళ్ళ ఘటన జరిగిందన్నారు. ఘటనపై సిఎం క్షమాపణ చెప్పాలని, మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతల డిమాండ్‌కు గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం ధన దోపిడీకి పాల్పడుతున్నదని విమర్శించారు. ఇసుక మాఫియాకు కెసిఆర్ కుటుంబం బాసటగా నిలిచిందని విమర్శించారు. సిఎం కెసిఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉన్నత స్థాయి విచారణ: లక్ష్మణ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ నేరెళ్ళపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని విమర్శించారు. ఎస్సైని తప్పించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్పీపై చర్య ఏదీ: చాడ
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిరిసిల్ల జిల్లా ఎస్‌పిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఎస్‌పిపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నేరెళ్ళ ఘటనలో వంద శాతం ఇసుక మాపియా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దమ్ముంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా గుట్టు బహిర్గతం చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.
చట్ట ఉల్లంఘన: కోదండరామ్
టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రసంగిస్తూ నేరెళ్ళ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. ఇసుక మాఫియా కోసమే చట్టాన్ని పక్కన పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్పందన బాగా లేదని గవర్నర్‌కు చెప్పామని ఆయన తెలిపారు. టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే నేరెళ్ళకు వెళ్ళాలని అన్నారు.

చిత్రం.. నెరెళ్ల ఘటనపై గవర్నర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న అఖిలపక్షం నేతలు