రాష్ట్రీయం

తేలని పంపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: విభజన సమస్యల పరిష్కారానికై ఉమ్మడి గవర్నర్ వద్ద తెలుగు రాష్ట్రాల పంచాయితీ నడిచింది. గవర్నర్ నరసింహన్ మరోసారి ఇద్దరు సిఎంలతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనేటీ విందుకు తెలంగాణ, ఆంధ్ర సిఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబు హాజరయ్యారు. తేనేటీ విందు ముగిశాక ఇద్దరు సిఎంలతో గవర్నర్ గంటన్నరపాటు సమావేశమయ్యారు. విభజన సందర్భంగా 60:40 నిష్పత్తిలో ఉద్యోగుల విభజన కారణంగా తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రలో, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో కొనసాగాల్సి రావడంపై చర్చించారు. ఇదేమీ సమస్య కాదని, నెల రోజుల్లో పరిష్కారం చేసుకోవచ్చని సిఎంలు అభిప్రాయపడ్డారు. కాగా భవనాల అప్పగింతపైనే ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలిసింది. ఆంధ్ర ప్రభుత్వం అమరావతి నుంచే పాలన కొనసాగిస్తున్నందున, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆంధ్ర ఆధీనంలో ఉన్న భవనాలను అప్పగించాలని, దీంతో తమకు కొంత సమస్య తీరుతుందని తెలంగాణ సిఎం కెసిఆర్ కోరారు. ఈ విషయంలో తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని చంద్రబాబు అన్నట్టు తెలిసింది.
అమరావతి భవనాలు తాత్కాలికమేనని, పూర్తి నిర్మాణం జరగాల్సి ఉందని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని, పూర్తి నిర్మాణం జరిగేంత వరకూ అన్ని భవనాలను తెలంగాణకు అప్పగించటం సాధ్యపడదని చంద్రబాబు తేగెసి చెప్పినట్టు సమాచారం. ఆంధ్ర అసెంబ్లీ భవనంతోపాటు, ఆవరణలోని ఆఫీసు కార్యాలయాలను తమకు అప్పగించాలని కెసిఆర్ కోరారు. వాటిని ఉపయోగిస్తుంటేనే బాగుంటాయని, లేకపోతే దెబ్బతింటాయని కెసిఆర్ సూచించినట్టు తెలిసింది. మీరు వాడనప్పుడు తాళం వేసుకుని ఉండటం భావ్యం కాదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గవర్నర్ జోక్యం చేసుకుని ఇరువురూ పునరాలోచన చేయాల్సిందిగా సూచించారని సమాచారం. అనంతరం వివిధ అంశాలపైనా ఇద్దరు సిఎంలు చర్చలు జరిపారు. అప్పటికే పవన్ కళ్యాణ్ రాజ్‌భవన్‌లో మరో గదిలో వేచి ఉన్నారు. గవర్నర్‌తో ఇద్దరు సిఎంల చర్చలు ముగిసిన తర్వాత, వారు పవన్ కళ్యాణ్‌నూ ఆహ్వానించారు. తరువాత నలుగురూ కాస్సేపు సరదాగా మాట్లాడుకున్నట్టు తెలిసింది.

చిత్రం.. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు