రాష్ట్రీయం

నేను చీఫ్ సర్వెంట్‌ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: ‘నేను తెలంగాణ ప్రజల చీఫ్ సర్వెంట్‌ని’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్య సేవకుడనే అర్థమన్నారు. నాంపల్లి హజ్ భవన్ నుంచి మంగళవారం బయలుదేరిన యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింలు తన వెన్నంటి నడిచారని గుర్తు చేసుకున్నారు. తనకు అండగా నిలిచిన ముస్లింలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ముస్లింల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.5లక్ష లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని నమ్మకంగా చెప్పారు. చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ అన్ని రంగాల్లో ప్రపంచానికి ఆదర్శం కావాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. స్వాతంత్య్రానికి పూర్వమే నిజాం ప్రభువు అప్పట్లోనే అత్యంత ధనికుడన్నారు. మక్కాలో నిజాం రాజు అప్పట్లోనే ఇక్కడి నుంచి వెళ్లే యాత్రికుల వసతి కోసం భవనం నిర్మించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిజాం నిర్మించిన భవనానికి ఉమ్మడి రాష్ట్రం లో కనీసం రంగులు కూడా వేయకుండా నిర్లక్ష్యం చేశారని సిఎం కెసిఆర్ విమర్శించారు. హజ్ హౌస్ నుంచి బయలుదేరిన యాత్రికులకు సిఎం కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, మైనారిటీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్ తదితరులు వీడ్కోలు పలికారు.

చిత్రం.. ముస్లింల బస్సుకు జెండా ఊపి హజ్ యాత్రకు సాగనంపుతున్న సిఎం కెసిఆర్