రాష్ట్రీయం

విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 15: దేశంలోని విద్యుత్ ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్‌రంగంలో ప్రవేశించిన తొలిదశలోనే 1200మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించిందన్నారు. రానున్న 5సంవత్సరాలలో 25కొత్త గనులను ప్రారంభించి దేశ అవసరాలకు తగ్గట్టుగా బొగ్గు సరఫరా చేస్తామన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 100మెగావాట్ల సోలార్ విద్యుత్‌ప్లాంట్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కోలిండియా స్థాయిలో సింగరేణి యాజమాన్యం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పెరుగుతున్న బొగ్గు అవసరాల రీత్య ఈఏడాది 660లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఉత్తమ సింగరేణి ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్, డైరెక్టర్లు భాస్కర్‌రావు, చంద్రశేఖర్‌రావు, శంకర్, జిఎం (పర్సనల్) మహ్మద్ ముజాహిద్, జిఎం ఆనందరావు, గుర్తింపు కార్మికసంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య, ఆకునూరి కనకరాజు పాల్గొన్నారు.