రాష్ట్రీయం

అభిమాని చెంప ఛెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్ లాన్‌లో ఇరు రాష్ట్రాల ప్రముఖులకు తేనేటీ విందు ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యారు. ఇంకా జనసేన నేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తొలిసారి రాజ్‌భవన్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా కొంత మంది పవన్ కళ్యాణ్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన కూడా కాదనలేకపోయారు. ఈ లోగా గవర్నర్ సెక్యురిటీ సిబ్బంది లాన్‌లో కూర్చుని ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి సార్ రమ్మంటున్నారని చెప్పి లోపలికి తీసుకెళుతున్నారు. ఆ సమయంలో సికింద్రాబాద్, వారాసిగుడాకు చెందిన వరప్రసాద్ పవన్‌తో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. దీంతో పవన్ చుటూ ఉన్న సెక్యురిటీ సిబ్బందిలో ఒకతను వరప్రసాద్ చెంప చెళ్ళుమనిపించారు. వరప్రసాద్ దిమ్మతిరిగిపోయాడు. మీడియాతో తన ఆవేదన వెలిబుచ్చారు. తాను 12 ఏళ్ళుగా పవన్ అభిమానినని, ఫొటో దిగాలని ప్రయత్నిస్తే దౌర్జన్యం చేశారని వరప్రసాద్ బావురుమన్నాడు.