రాష్ట్రీయం

సిఎంల కోసం నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం రాజ్‌భవన్ (ఎట్ హోం)లో తేనేటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సినీ నటుడు, జన సేన నేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఇరువురు ముఖ్యమంత్రులూ అరగంటకు పైగా ఆలస్యంగా రావటంతో గవర్నర్ వేచి చూడాల్సి వచ్చింది.
సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. అప్పటికే కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు, సిఎల్‌పి నేత జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఉన్నతాధికారులు, అనేక మంది ప్రముఖులు రాజ్‌భవన్ లాన్‌లో ఆసీనులయ్యారు. సామాన్యంగా గవర్నర్ కార్యక్రమం అంటే ఠంచనుగా ప్రారంభమవుతుంది. 5.30గంటలకు గవర్నర్ లాన్‌లోకి రాగానే పోలీసు బ్యాండ్‌తో జనగణమన జాతీయ గీతం ప్రారంభమవుతుంది. కానీ 5.50 నిమిషాల వరకూ గవర్నర్ దంపతులు రాలేదు.
వారు రాగానే జాతీయ గీతాలాపన జరిగింది. ఆ తర్వాత గవర్నర్ లాన్‌లో ఉన్న ప్రముఖులందరినీ కలవడం ప్రారంభించారు. విలేఖరులు గవర్నర్‌ను కలిసి ఇద్దరు చంద్రులు లేకుండా మీరు వచ్చారు..? అని ప్రశ్నించడంతో, ఆయన చిన్నగా నవ్వుతూ వారిరువురూ కొద్దిసేపట్లో రాబోతున్నారని, మిమ్మల్ని ఎక్కువ సేపు వేచి ఉంచడం బాగుండదని వచ్చానన్నారు. సరిగ్గా 6.05 గంటలకు ఇద్దరు సిఎంలు రావడంతో గవర్నర్ వెళ్ళి వారిని స్వాగతించి, లాన్‌లోకి తీసుకుని వచ్చారు. ముగ్గురూ కలిసి లాన్‌లో ప్రతి ఒక్కరినీ పలుకరించారు. విడిగా ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులూ కొంతసేపు విడిగా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్‌నూ వారు పలుకరించారు.
లక్ష్మణ్‌తో పవన్ భేటీ
లాన్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ తమ జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ లక్ష్మణ్‌తో అన్నారు. తెలంగాణ శాఖకు శంకర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మంత్రి కెటిఆర్ చాలాసేపు సరదాగా మాట్లాడడం కనిపించింది. ఎంపి టి. సుబ్బరామి రెడ్డితో కూడా అక్కడే కొంత సేపు మాట్లాడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గవర్నర్ నరసింహన్ చూశారా? అందరినీ కలిపాను అనడంతో అందరూ నవ్వారు. పరస్పరం అప్యాయంగా పలుకరించుకుంటూ జోక్స్ వేసుకున్నారు.

చిత్రం.. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటుచేసిన ఎట్ హోంలో పాల్గొని ముచ్చటించుకుంటున్న తెలంగాణ సిఎం కెసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు