రాష్ట్రీయం

ఐదేళ్లుగా అదే బీడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 17: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని సుమారు 3లక్షల ఎకరాల ఆయకట్టు మరోసారి బీడుగా మారనుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఆయకట్టు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2013, 14 సంవత్సరాలలో కాల్వల ఆధునీకరణ నిమిత్తం క్రాప్ హాలిడే ప్రకటించారు. తర్వాత రెండేళ్లలో నీరులేక పంటలు వేయలేదు. ఇప్పుడు నీరు లేకపోవడంతో వరుసగా 5వ సంవత్సరమూ ఆయకట్టు రైతులు ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగుచేసే పరిస్థితులు లేక దిక్కులు చూస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అది 500 అడుగులుగా ఉంది. దీంతో నీరులేక ఖరీఫ్ సీజన్‌లో రైతులు తమ పొలాలను బీళ్ళుగానే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగార్జునసాగర్ జలాశయం ఎప్పుడు నిండుతుందా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరందించే సాగర్ ఎడమకాల్వకు 77టిఎంసి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ పరిస్థితి లేకపోవడంతో సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఎగువ కృష్ణానదిపై కర్ణాటకలో ఆల్మటి, నారాయణపూర్ రిజర్వాయర్‌లు పూర్తిగా నిండిన తరువాతే దిగువనున్న రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన మూడేళ్ళలో సాగర్, శ్రీశైలం జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం కూడా కనిపించలేదు. గడిచిన ఆగస్టు నెలలో కొంతమేరకు నీటిని విడుదల చేసినప్పటికీ అవి కేవలం తాగునీటికి మాత్రమే సరిపోయేలా విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ చివరి వారంనుంచి ఆయకట్టులో నిలిచివున్న ఆరుతడి పంటలను కాపాడేందుకు వారబందీ పద్ధతిలో నీటిని సరఫరా చేశారు. హైదరాబాద్ నగరం, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి కింద 23టిఎంసి నీటిని, పూర్వపు నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు సాగునీటి కోసం 45టిఎంసి నీటిని విడుదల చేశారు. వరసగా ఐదేళ్ళ నుంచి ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల సాగర్ ఆయకట్టు రైతులు నీటిపై ఆశలు వదులుకున్నారు. ప్రత్యామ్నయంగా అనేకమంది బోర్లు, బావులు తవ్వుకున్నారు. గత 30ఏళ్ళుగా సాగర్ నీటితో సస్యశ్యామలంగా మారిన ఆయకట్టు నేడు బీడుగా మారిపోతుండటం గమనార్హం. ఇప్పటికే అనేకచోట్ల తుంగగడ్డి పెరిగి సాగుకు అవకాశం లేకుండా పోయిందని రైతులే గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరిపోయిందని, నీటిమట్టం పెరిగితేనే విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రైతులు అంటున్నారు. నెలాఖరులోగా ఎగువ కృష్ణాప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నామని, ఆగస్టు నెలవరకు నీరు రాకపోతే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు మానిటరింగ్ ఈఈ పుల్లయ్య తెలిపారు.

చిత్రం..బీళ్లును తలపిస్తున్న సాగర్ ఆయకట్టు పొలాలు