రాష్ట్రీయం

హైదరాబాద్‌లో దారుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ న్యూఢిల్లీ, ఆగస్టు 17: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన పదహారేళ్ల బాలికను 65 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని ఓమన్ దేశానికి తీసుకెళ్లి వేధిస్తుండటంతో సదరు బాలిక హైదరాబాద్‌లోని తల్లికి ఫోన్ చేయటంతో సంఘటన వెలుగుచూసింది. బాలిక మేనత్త ఓమన్‌కు చెందిన
అరబ్ షేక్‌తో పెళ్లి విషయమై వ్యవహారం నెరపింది. బాలిక తండ్రిని ఒప్పించి రూ. 5లక్షలకు కూతురిని ఓమన్ దేశస్థుడికి ఇచ్చి కట్టబెట్టారని బాలిక తల్లి ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితం తనకు తెలియకుండానే ఇరువురికీ వివాహం జరిపించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం తన కుమార్తె ఫోన్ చేసి హైదరాబాద్‌కు తీసుకురావాలని కోరుతోందని తల్లి బోరున విలపిస్తూ చెప్పింది. తన కూతురిని వివాహం చేసుకున్న వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడగా, పెళ్లి సమయంలో రూ. 5 లక్షలు చెల్లించానని చెప్తున్నాడని వివరించింది. డబ్బు వెనక్కు పంపితే బాలికను తిరిగి హైదరాబాద్ పంపుతానని అంటున్నాడని బాలిక తల్లి తెలిపింది. కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు బాలికను హైదరాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇదిలావుంటే, ఓమాన్ షేక్ గుప్పిట్లో చిక్కుకున్న హైదరాబాద్ ముస్లిం బాలికను రక్షించేందుకు సాయం చేయాలని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఓమాన్‌కు చెందిన 65 ఏళ్ల షేక్ ఐదు లక్షలకు హైదరాబాదీ ముస్లిం బాలికను పెళ్లిచేసుకుని, అతని దేశానికి తీసుకుపోయినట్లు వచ్చిన వార్తలకు మేనక గాంధీ స్పందించారు. పదహారేళ్ల ముస్లిం బాలిక వార్త తన దృష్టికి రాగానే మేనక గాంధీ సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. ఓమాన్ ప్రభుత్వంతో మాట్లాడి బాలికను రక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సుష్మను కోరారు. దీంతో సుష్మాస్వరాజ్, ఓమాన్‌లోని భారత రాయబారితో చర్చించి రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.