రాష్ట్రీయం

హంతకుడికి ఉరి శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, ఆగస్టు 17: నెల్లూరు జిల్లాలో గొలుసు హత్యలకు పాల్పడటమేకాక మహిళా టీచర్‌ను దారుణంగా హత్య చేసిన కుక్కపల్లి వెంకటేశ్వర్లుకు ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి శ్రీనివాసరావు గురువారం తీర్పు చెప్పారు. ఇదే జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలం అనంతపురం జిల్లా హిందూపురంలో క్యాంటిన్‌లో పనిచేసి వ్యసనాలకు బానిసయ్యాడు. తరువాత నెల్లూరు జిల్లా కావలికి మకాం మార్చి అక్కడ నూడిల్స్ వ్యాపారం చేసేవాడు. అక్కడా అందినచోటల్లా అప్పులు చేసి, వాటిని తీర్చడానికి దొంగతనాలు, పలు హత్యలు, దోపిడీలకు పాల్పడ్డాడు. కావలి పట్టణంలోనే మహిళను హత్య చేసి ఇద్దరు చిన్నపిల్లలను తీవ్రంగా గాయపరిచిన కేసులోను, నెల్లూరు రూరల్ మండలం చిన్నచెరుకూరులో పూజారి దంపతులను హత్య చేసి దోపిడీకి పాల్పడిన కేసులోను ఇతను ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కాగా, 2016 జూలై 9న నెల్లూరు పట్టణం చిల్డ్రన్స్ పార్కు సమీపంలో మోటార్ సైకిల్‌పై రెక్కీ నిర్వహించి, సాయినగర్‌లోని మహిళా టీచర్ ఇల్లు దొంగతనానికి అనువుగా ఎంచుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో మహిళా టీచర్ ఇంటికి వెళ్లి దొంగతనానికి పాల్పడుతూ, అడ్డుకున్న టీచర్ ప్రభావతిని ఇనుప సుత్తితోగాయపర్చాడు. ఆమె కేకలు వేయడంతో పక్క గదిలోని బంధువుల పిల్లలు గుంపత్తి మాధురి, అనంతకృష్ణ రాగా వారినీ తీవ్రంగా గాయపర్చాడు. నగలు, నగదు దోచుకుని వెళ్తుండగా టీచర్ భర్త నాగేశ్వరరావు గమనించి పారిపోతున్న వెంకటేశ్వర్లును స్థానికుల సాయంతో గదిలో బంధించారు. ఘటనలో టీచర్ అప్పటికే మృతి చెందగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హతురాలి భర్త నాగేశ్వరరావు ఫిర్యాదుమేరకు, తీవ్ర గాయాలైన ప్రత్యక్ష సాక్షులు మాధురి, అనంతకృష్ణ సాక్ష్యాధారాలతో వెంకటేశ్వర్లుపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కోర్టులో చార్జిషటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి గురువారం నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. కేసును అప్పటి బాలాజీనగర్ సిఐ కెసిహెచ్ రామారావు దర్యాప్తు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పిపి రఫీమాలి వాదించారు.