రాష్ట్రీయం

టీమ్ లీడర్ లోకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సంమయనం పాటించాలని తెలుగుదేశం నేతలు, శ్రేణులకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక పూర్తి బాధ్యతలను మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు అప్పగించారు. ఉండవల్లిలో తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశంలో ప్రధానంగా నంద్యాల ఎన్నికలపై చర్చ జరిగింది. ఓటమి భయంతో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వైకాపా ప్రయత్నిస్తోందని పులువురు నేతలు అభిప్రాయపడ్డారు. వైకాపా అంతర్గత సమావేశాల్లో ఇదే అంశంపై పార్టీ శ్రేణులను జగన్ రెచ్చగొడుతున్నారంటూ సిఎం దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకొచ్చారు. దీనిపై సిఎం స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా, వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ప్రతికార్యకర్తకు చేరేలా చూడాలని స్పష్టం చేశారు. వైకాపా రెచ్చగొడుతున్న తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలను వాయిదా వేయించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని, ఇందుకు సంబంధించిన సమాచారం తనవద్ద ఉన్నట్లు చెప్పారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఉపఎన్నికల్లో 10 రోజలపాటు ప్రచారం చేసిన ఏకైక ప్రతిపక్ష నేత జగన్ అని, సిఎంను కాల్చమని చెప్పడం ద్వారా అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ప్రస్తావించారు. మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి సిఎం సమక్షంలో టిడిపిలో చేరతారని, వైకాపాకు ఓడిపోతామన్న భయం పట్టుకుంటుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపా కుట్రలపై అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం
దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాల ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రి అచ్చెన్నాయుడుకూ కీలక బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. సెప్టెంబర్ 3నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1న వర్కుషాపు నిర్వహించేందుకు ప్రతిపాదించారు. రెండు నెలలపాటు ఇంటింటికీ తెలుగుదేశం నిర్వహించనున్నారు. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యతను మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకూ జలసిరికి హారతులు నిర్వహించనున్నారు.

చిత్రం..లోకేష్‌