రాష్ట్రీయం

మహాగణపతి మెడలో పోచంపల్లి కండువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 17: ఖైరతాబాద్ మహా వినాయకుడి మెడలో అలంకరించే 25 మీటర్ల పొడవైన కండువాను పోచంపల్లి చేనేత కళాకారులు తయారు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామ పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌లో చేనేత మగ్గంపై కండువాను తయారు చేస్తున్నారు. వినాయక చవితికి భారీ కండువా అందించేందుకు నేతన్నలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చందనం రంగులో ఉండే 25 మీటర్ల పొడవైన కండువాపై హిందూ సంస్కృతి, సంప్రదాయ ధర్మ ప్రతిష్ట ప్రతిబింబించేలా గులాబీరంగులో మహా శివలింగాలు, తామర పుష్పాలు, ఓంకారం, స్వస్తిక్, ఢమరుకం, పూర్ణకుంభం, గణపతి లడ్డూ, హ్యాండ్లూమ్ పార్క్ లోగో, పీహెచ్‌పీ అక్షరాలు ప్రతిబింబించేలా తయారు చేశారు. ఈసారి ఖైరతాబాద్‌లో 63 అడుగుల వినాయకుడు
కొలువు తీరనున్నాడు. కండువా తయారీ కోసం హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, సీఈవో దామోదర్, డైరెక్టర్లు భారత లవకుమార్, అమరేందర్, చిట్టిపోలు గోవర్థన్‌తోపాటు నేత కార్మికులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు వినాయక విగ్రహానికి నేత కండువా అలంకరించడం గమనార్హం.

చిత్రం..మహా వినాయకుడి మెడలో అలంకరించేందుకు హ్యాండ్లూమ్ పార్కులో సిద్ధం చేస్తున్న నేత కండువా