రాష్ట్రీయం

ఎడాపెడా ప్రాజెక్టులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై రెండు తెలుగు రాష్ట్రాల అభియోగాలను కొలిక్కి తేవాలని కృష్ణా బోర్డు యోచిస్తోంది. కృష్ణా జలాల యాజమాన్య బోర్డు ఈసారి అమరావతిలో 22న మంగళవారం జరగనుంది. అక్రమ ప్రాజెక్టులే అజెండా సాగనున్న సమావేశం హాట్‌హాట్‌గా జరగొచ్చని అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత అక్రమ ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, లెక్కలేనన్నిసార్లు బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. అమరావతిలో జరిగే బోర్డు మీటింగ్‌లో అక్రమ ప్రాజెక్టుల అంశంపైనే చర్చించాలని కృష్ణా బోర్డు అజెండా ఖరారు చేసింది. సమావేశానికి హాజరై తమ వాదనలు బలంగా వినిపించేందుకు రెండు రాష్ట్రాల సాగునీటి పారుదల మంత్రిత్వ శాఖలు సమాయత్తం అవుతున్నాయి. సమావేశంలో కృష్ణా జలాల వినియోగ పరిమాణాన్ని కొలిచేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పరికరాల వ్యవస్ధ, ఈ తరహాలో మరిన్ని టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు చేసే అంశాలపైనా చర్చించనున్నారు. చిన్నతరహా సాగునీటి వనరులు, నీటి వినిమయంపైనా చర్చిద్దామంటూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు రాసిన లేఖలో పేర్కొంది.
విభజన తర్వాత కేంద్రానికి, బోర్డుకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రం ఎడా పెడా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. పులికనుమ, సిద్ధాపురం, గాజులదినె్న, శివభాష్యం సాగర్, మునే్నరు, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడికాల్వ, గుండ్రేవుల రిజర్వాయర్ తదితర ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నారని, దీనివల్ల ఎగువ రాష్టమ్రైన తమకు కృష్ణా నదిలో అదనపు జలాలు వాడుకునే హక్కు ఉందని తెలంగాణ గత మూడేళ్లుగా కేంద్రానికి, బోర్డుకు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. ఈ అంశం చర్చకొచ్చినా, విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే బాధ్యతను ఎకె బజాజ్ కమిటీకి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అప్పగించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, దిండి, భక్తరామదాస, కల్వకుర్తి, తుమ్మిళ్ల ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందన్నది ఆంధ్ర వాదన. కాని ఈ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్ర హయాంలోనే పాలనాపరమైన అనుమతులు లభించిన విషయాన్ని తెలంగాణ ప్రస్తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం 85(సి) నిబంధన కింద కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే ముందుగా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఈ ప్రాజెక్టులతో పాటుగా చిన్న తరహా సాగునీటి వనరులు, వాటిల్లో నిల్వ ఉండే నీటి వినియోగంపైనా చర్చ జరగనుంది.
ఇక 2018-19 సంవత్సరానికి కృష్ణా జలాల నీటి వినియోగంపై సమావేశంలో చర్చించనున్నారు. విచిత్రమేమిటంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం 530 టిఎంసి ఉంటే, పట్టుమని 135 టిఎంసి నీరు కూడా లేదు. ఇంకా వరద నీరు శ్రీశైలంలోకి రాలేదు. వర్షాభావ పరిస్థితులతో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. కాగా ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే వచ్చే నీటిని ఎలా వినియోగించాలన్న దానిపై విధివిధానాలను కృష్ణా బోర్డులో ఖరారు చేస్తారు. కాగా రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా కర్నాటక ప్రభుత్వాన్ని కోరితే 20 టిఎంసి నీటిని ఆల్మట్టి నుంచి విడుదల చేస్తే, ఆ నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో దాహార్తితో అల్లాడే నగరాలు, పట్టణాలు, గ్రామాలకు మంచినీటి సరఫరా చేసే అవకాశం ఉందని సాగునీటి నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 15 టిఎంసి నీటిని విడుదల చేయాలని కర్నాటకను కోరింది. హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ ఉన్నతాధికారి కర్నాటక వెళ్లి నీటి విడుదలపై విజ్ఞప్తి చేశారు. కాగా సిఎంల స్ధాయి సమక్షంలో జరిగే చర్చల్లోనే దీనిపై కర్నాటక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, అధికారుల స్థాయిలో తేలే పరిస్థితి లేదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.