రాష్ట్రీయం

లెక్కలు తేలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: సమగ్ర భూ సర్వేపై 20న ప్రగతి భవన్‌లో విస్తృత సమావేశం నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సమావేశంలో సమగ్ర భూ సర్వే నిర్వహణా కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నట్టు వెల్లడించారు. భూసర్వే నిర్వహణపై కొందరు కలెక్టర్లు, సీనియర్ రెవిన్యూ అధికారులతో కూడిన బృందం అధ్యయనం చేస్తుందన్నారు. వారిచ్చే నివేదికపై చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ సంయుక్త కార్యదర్శి (్భ వనరులు) హుకుంసింగ్ తన బృందంతో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో త్వరలో చేపట్టనున్న భూసర్వేపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర భూ సర్వే విప్లవాత్మకమైందని, ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని హుకుంసింగ్ ప్రశంసించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హుకుంసింగ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో 1932-36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగిందని, తర్వాత సర్వే జరుగలేదని సిఎం వివరించారు. భూ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక అనర్థాలు, వివాదాలు జరుగుతున్నాయన్నారు. ఏ భూమికి ఎవరు యాజమానో తెలియని గందరగోళ పరిస్థితుల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ. 8 వేల చొప్పున పెట్టుబడి అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే ఉచిత పెట్టుబడి అందించడానికి ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని పకడ్బందిగా అమలు చేయడానికి భూ సర్వే చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 10,875 రెవిన్యూ గ్రామాలలో గ్రామం యూనిట్‌గా తీసుకొని సర్వే నిర్వహిస్తామన్నారు. ఒక్కో గ్రామంలో అధికారులు సుమారు నెలపాటు ఉండి, రైతుల సహకారంతో భూ రికార్డులను అప్‌డేట్ చేసి ఆన్‌లైన్‌కు అనుసంధానిస్తారన్నారు. రికార్డులన్నీ అప్‌డేట్ అయిన తర్వాత కొత్త పాసు పుస్తకాలను జారీ చేస్తామన్నారు. అలాగే భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్‌లో సంస్కరణలు, పారదర్శకతను ప్రవేశపెడతామన్నారు. రిజిస్ట్రేషన్ అయిన రోజుననే ముటేషన్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. ఇవన్నీ జరుగాలంటే భూరికార్డులు సక్రమంగా ఉండటం ముఖ్యమన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఏ వివరాలు సరిగ్గా ఉండేవి కావన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాతనే ప్రభుత్వానికి సమగ్ర అవగాహన ఏర్పడిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు ఆ సర్వే ఎంతో దోహదపడిందన్నారు. భూసర్వే జరిగితే రైతులకు సమకూర్చే ఉచిత పెట్టుబడి పథకం సక్రమంగా అమలుకు, అలాగే భూవివాదాలకు తెరపడుతుందన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే సమగ్ర భూ సర్వేకు కేంద్రం సహకారం కావాలని, త్వరలో దీనిపై కేంద్రానికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక పంపిస్తామన్నారు. తమ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ఇక్కడి తమ అనుభవం పనికొస్తుందని సిఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ వినూత్నంగా నిర్వహించబోయే భూసర్వే దేశవ్యాప్తంగానూ నిర్వహించాల్సిన అవసరం ఉందని హుకుంసింగ్ అభిప్రాయపడ్డారు. దీనికి కేంద్రం తరఫున అన్ని విధాలుగా ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఆమోదించిన 25 సర్వే ఏజెన్సీలు ఉన్నాయని, వాటి సేవలను సర్వేలో వినియోగించుకోవచ్చని హుకుం సింగ్ స్పష్టం చేశారు.

చిత్రం..సమగ్ర భూ సర్వేపై సిఎస్, రెవిన్యూ ఉన్నతాధికారులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్