రాష్ట్రీయం

చెట్టే కదాని నరికేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 19: చెట్లు నరికే వ్యక్తులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటే పచ్చదనం పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కోటప్పకొండ వద్ద 20 ఏళ్ల క్రితమే గ్రీనరీ కోసం చర్యలు తీసుకోవడంతో, అది నేడు అడవిగా మారిందన్నారు. జీవరాసుల మనుగడ కోసం మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించు కోవాలని పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని ఒక హోటల్‌లో ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జాతీయస్థాయ వర్క్‌షాప్‌ను ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ మనకోసం, మన ఆరోగ్యం కోసం, భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో 20 శాతమున్న అటవీ ప్రాంతాన్ని 40 శాతానికి పెంచేందుకు సిఎం చంద్రబాబు ఏటా లక్షల మొక్కలు నాటేలా ఆదేశాలిచ్చారన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ విజయవాడలో ఒకప్పుడు చింతచెట్లు బాగా ఉండేవని, నగరీకరణలో భాగంగా వాటిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. నేడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు లేకపోవడమే కారణమన్నారు. ఏటా లక్ష చెట్లను నగరంలో నాటుతున్నామని, అందులో 50 వేల చెట్ల వరకు కాపాడగలుగుతున్నామన్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీనరీ అభివృద్ధికి ట్రీ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి చంద్రమోహన్ తదితరులు మాట్లాడారు. వర్క్‌షాప్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అమరావతి చాప్టర్ ఛైర్మన్ విజయసాయి మేకా, సిఐఐ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ రఘుపతితో పాటు దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..జాతీయస్థాయ సదస్సులో మాట్లాడుతున్న స్పీకర్ కోడెల