తెలంగాణ

ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదాబాద్, నవంబర్ 27: ఖైదీల సంస్కరణ, పరిపాలన విభాగంలోతెలంగాణ జైళ్లశాఖ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మలక్‌పేట నల్గొండ చౌరస్తా వద్ద రూ.5.60కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ప్రతిపాదనల మేరకు అర్హులైన, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తామని తెలిపారు. జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ రూపొందించిన మహాపరివర్తన కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణను అందించడం వల్ల వారు విడుదలైన తరువాత తగిన ఉపాధి పొంది తమ కుటుంబాలతో స్థిర పడటమే మహాపరివర్తన ప్రోగ్రాం లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్ల ఆవరణలో సుమారు 90వేల టేకు మొక్కలను నాటామని, దీనిద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు జైళ్లశాఖకు గణనీయమైన ఆదాయం కూడా లభిస్తుందని అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో మూడు అంతస్తులకు 36వేల ఎస్‌ఎఫ్‌టి కలిగిన ఈ నూతన కార్యాలయ భవనం దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందనుందన్నారు. జైళ్ల శాఖ అధీనంలో ప్రస్తుతం పనిచేస్తున్న పెట్రోల్ బంకులకు అదనంగా ప్రతి జిల్లాలో మరి కొన్ని బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ జైళ్ల శాఖ నూతన పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని