రాష్ట్రీయం

గోదారమ్మకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 20: మూడు రోజుల క్రితం వరకు కూడా ఇసుక తినె్నలు, బండరాళ్లతో దర్శనమిస్తూ బోసిపోయి కనిపించిన గోదావరి నదికి భారీ వర్షాలు జలకళ చేకూర్చాయి. తెలంగాణతో పాటు ఎగువన గల మహారాష్టల్రోనూ ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల వరద జలాలు వడివడిగా గోదావరిలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ జీవనది నీటి ప్రవాహంతో నిండుదనాన్ని సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా గోదావరి అడుగిడే త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి వద్ద పుష్కరఘాట్ మెట్లను తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతుండగా, బాసరకు ఆనుకుని జిల్లా సరిహద్దు ప్రాంతమైన నవీపేట మండలంలోని కోస్లీ పంప్‌హౌస్ వరకు గోదావరి జలాలు చేరుకున్నాయి. గోదావరి ప్రవాహంపైనే ఆధారపడి ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో తొలిసారిగా ఒకింత ఎక్కువ మొత్తంలో ఇన్‌ఫ్లో చేరడం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి గోదావరి ద్వారా ఎస్సారెస్పీలోకి 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువన మహారాష్టల్రోని అమ్దురా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో మిగులు జలాల రూపంలో సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఎస్సారెస్పీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మిగులు జలాలు ఆదివారం రాత్రి నాటికి ఎస్సారెస్పీలోకి వచ్చి
చేరతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఎస్సారెస్పీ నీటిమట్టం ఒకింత గణనీయంగానే పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 1091.00 అడుగులు, 90 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం నాటికి 1055.80 అడుగులు, 9.9 టిఎంసిల వద్ద నీరు నిలిచి ఉంది. ఎగువన మహారాష్ట్ర నుండి మిగులు జలాలు కూడా వచ్చి చేరనుండడంతో మరో రెండు టిఎంసిల వరకు నీటి నిల్వలు పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. కల్యాణివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోవడంతో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తుండగా, కౌలాస్‌నాలా సైతం ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చేరువవుతోంది. ఏకధాటి వర్షాల వల్ల నవీపేట మండలంలో పలుచోట్ల రోడ్లు కుంగిపోగా, మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆరబెట్టిన సుమారు 500 క్వింటాళ్ల పెసర పంట తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో 200 ఎకరాల విస్తీర్ణంలో చేతికందే దశలో ఉన్న పప్పు దినుసు పంటలు నేలరాలాయి. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షంతో ఎటుచూసినా అన్ని ప్రదేశాలు జలమయమై కనిపించాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 89.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రెంజల్‌లో 194.8 మి.మీ, నవీపేటలో 184, వర్ని, రుద్రూర్‌లో 162.4 మి.మీ, కోటగిరిలో 168.6, బోధన్‌లో 148.6, మాక్లూర్‌లో 114.4 మి.మీలు, నిజామాబాద్‌లో 94 మి.మీ, డిచ్‌పల్లి, ఇందల్వాయిలలో 90.2 మి.మీ, నందిపేటలో 84.6 మి.మీ, ఎడపల్లిలో 87.6 మి.మీ, భీమ్‌గల్‌లో 63.6 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో సైతం అత్యధికంగా నిజాంసాగర్‌లో 150 మి.మీలు, పిట్లంలో 120.4, బీర్కూర్‌లో 10సెం.మీ, కామారెడ్డిలో 100.2మి.మీ, తాడ్వాయిలో 86.2, మాచారెడ్డిలో 82.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో గోదావరి నదిలో పెరిగిన వరద ప్రవాహం