రాష్ట్రీయం

కంటైనర్‌తో పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/హయత్‌నగర్/చౌటుప్పల్, ఆగస్టు 20: హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు సిగరెట్ల కంటైనర్‌ను దొంగలించారు. సినీ ఫక్కీలో శనివారం రాత్రి జరిగిన దోపిడీలో రూ. 4కోట్లకుపైగా విలువైన సిగరెట్లు అపహరించారు. నగరంలోని ముషీరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన కంటైనర్‌ను కొందరు దుండగులు హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద అడుడకున్నారు. డ్రైవర్‌ను చితక బాది, తమతోపాటు తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను నింపుకొని పరారయ్యారు. ముషీరాబాద్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దగల కోస్టల్ రోడ్ వేస్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బీహార్ రాష్ట్రానికి చెందిన అఖిలేష్ కుమార్ యాదవ్ లారీ (కెఎ2ఎడి1220) కంటైనర్‌లో సిగరెట్ లోడ్‌తో తిరుపతికి బయలుదేరాడు. అతని వెంట కంపెనీ ప్రతినిధులు రాము అనే వ్యక్తిని పంపించారు. కాగా, ఉప్పల్‌లో రాము దిగిపోయాడు. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వరకు కంటైనర్ చేరుకోగానే టాటా సుమో వాహనం, మరో లారీలో వచ్చిన 30మంది గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను అడ్డగించారు. డ్రైవర్ అఖిలేష్‌యాదవ్‌ను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా చితకబాదారు. కంటైనర్‌ను చౌటుప్పల్ సమీపంలోకి తీసుకెళ్లి అందులో ఉన్న రూ. 4.10కోట్ల విలువైన సిగరెట్ డబ్బాలను ఇతర వాహనంలోకి నింపుకుని పారిపోయారు. చెట్ల పొదల్లో నుంచి బయటకు వచ్చిన డ్రైవర్ అఖిలేష్ యాదవ్ జరిగిన సంఘటనను స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు సిఐ నవీన్‌కుమార్ సంఘటన ప్రాంతానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కంటైనర్‌కు జిపిఎస్ సిస్టమ్ ఉండటంతో కైతాపురం వద్ద వాహనం ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా కంటైనర్ ఖాళీగా ఉంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ జాయింట్ సిపి తరుణ్‌జోషి, భువనగిరి డిసిపి యాదగిరి, క్రైమ్ డిసిపి జానకి, ఎసిపి స్నేహితతో పాటు క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. కైతాపురం వద్ద సిసి కెమెరాలను పరిశీలించగా దుండగులు మరో వాహనంలో ఎక్కి వెళ్తున్నట్లు కన్పించింది. కానీ వాహనం నెంబర్‌ను గుర్తించే విధంగా స్పష్టంగా కన్పించడంలేదని అధికారులు పేర్కొన్నారు. పక్కా పథకం ప్రకారం, తెలిసిన వారే దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి హయత్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా ఈ కేసును రాచకొండ పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నారు.

చిత్రాలు..ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం, కంటైనర్ డ్రైవర్ అఖిలేష్ యాదవ్