రాష్ట్రీయం

వానరాలకూ సమాధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఆగస్టు 20: రక్తసంబంధీకులు ఉన్నా దహన సంస్కారాలకు నోచుకోక అనాథ శవాలుగా మారుతున్నవారిని మనం నిత్యం చూస్తుంటాం. ఎలాంటి సంబంధం లేకున్నా మృత్యువాత పడ్డ వానరాలకు ప్రత్యేకంగా సమాధుల కోసం స్థలాన్ని కేటాయించడమే కాక కర్మకాండలు జరిపించి మానవత్వాన్ని చాటుతున్నారు ఆ గ్రామస్థులు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం బిసలమానేపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో చనిపోయే కోతులకు సమాధులు కట్టి కర్మకాండ జరిపించి అన్నసంతర్పణ చేస్తున్నారు. కోతులు చనిపోతే వాటికి శాస్త్రోక్తంగా కళేబరాన్ని మేళతాళాలతో ఊరేగించి కర్మకాండ నిర్వహిస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం గ్రామంలో ఓ వానరం కారు ఢీకొని మృతి చెందడడంతో ఊరేగించి పూడ్చిపెట్టారు. అనంతరం దానికి సమాధి కట్టారు. మూడో రోజు సమాధికి పూజలు చేసి పూలతో అందంగా అలంకరించారు. సమాధిపై రకరకాల పండ్లు, పాయసం, చిత్రాన్నం పెట్టారు. అనంతరం గ్రామంలో అన్నదానం చేశారు. దశాబ్దాల కాలంగా ఈ ఆచారాన్ని తాము పాటిస్తున్నామని గ్రామానికి చెందిన అశ్వర్థనారాయణ, ఓబుళేసు, వేంకటేష్, పుష్ప, రూప తెలిపారు.
వానరం ఆంజనేయస్వామికి ప్రతిరూపమని, అందుకే చనిపోయిన తరువాత అంతా కలిసి సమాధి కట్టి, కర్మకాండలు నిర్వహిస్తున్నామన్నారు. వానరాల సమాధుల కోసం ప్రధాన రహదారి పక్కనే 20 సెంట్ల అసైన్డ్ భూమిని గ్రామ పంచాయతీ మంజూరుచేయడం గమనార్హం. ఈ కాలంలో కూడా వానరాలకు ప్రత్యేకంగా సమాధులు నిర్మించడం, శాస్త్రోక్తంగా కర్మకాండ నిర్వహించడం విశేషమే.

చిత్రం..వానరం సమాధి వద్ద కర్మకాండ నిర్వహిస్తున్న గ్రామస్థులు