రాష్ట్రీయం

6 గంటల్లో 9 ప్రపంచ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 20: మంత్రాలయం శ్రీ రామఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. 2,500 మంది భక్తులు ఆరు గంటల పాటు నిర్విరామంగా కీర్తనలు ఆలపించడం ద్వారా 9 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. శ్రీమఠం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీగురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు కీర్తనల కార్యక్రమాన్ని పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాస సాహిత్య డైరెక్టర్ అప్పణాచార్యుల నేతృత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్ పి.నారాయణదాసులు 108 శ్రీ ఆంజనేయ స్వామి భక్తికీర్తనలు ఆలపిస్తుండగా 1500 భజన మండళ్లకు చెందిన 2,500 మంది మహిళలు అనుసరించారు. మ. 12 గంటల నుండి సా. 6 గంటల వరకు నిర్విరామంగా ఈ కీర్తనల ఆలాపన కార్యక్రమం జరిగింది. తద్వారా 9 ప్రపంచ రికార్డులు సృష్టించారు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ ట్యాలెంట్ ఆర్గనైజేషన్ రికార్డు. వండర్‌బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు ఇండియా, మిరాకిల్ వరల్డ్ రికార్డు, గోల్డన్ స్టార్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు, మార్వలెష్ రికార్డులు సాధించారు. అవార్డుల ప్రశంశాపత్రాన్ని పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు పి.నారాయణదాసుకు అందించి ఆశీర్వదించారు.

చిత్రాలు..మంత్రాలయం మఠంలో ఆదివారం ఆరుగంటల నిరంతర భక్తికీర్తనల ఆలాపన
రికార్డులో పాల్గొన్న నారాయణదాసు, మహిళలు