రాష్ట్రీయం

ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 21: హోరాహోరీగా సాగిన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. భూమా నాగిరెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈనెల 23న ఉప ఎన్నిక జరగనుంది. టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. టిడిపి- వైసీపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఎన్నికలో ఓడిపోతే ఆ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందన్న భయంతో టిడిపి, ఈ ఎన్నికల్లో ఓడితే అసెంబ్లీ ఎన్నికలనాటికి తమ ఉనికే ఉండదన్న భయంతో వైసీపీ రెండూ చావోరేవోగా తీసుకున్నాయి.
రోడ్ షోలే జగన్ బలం
వైఎస్ జగన్ 13రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన నిర్వహించిన రోడ్‌షోలకు మంచి స్పందన లభించింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి అన్నీ తానే అయి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు పది రోజుల పాటు నంద్యాలలోనే ఉండి వీధి వీధి తిరిగారు. మరోవైపు వైసీపీ తన పార్టీ ఎమ్మెల్యేలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించింది. అభ్యర్థి శిల్పాను కాకుండా తనను చూసి ఓటు వేయాలని జగన్ తనను కలసిన వివిధ వర్గాలను అభ్యర్థించారు. స్థానికంగా ముస్లిం వర్గాల్లో శిల్పాపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, అత్యాచారానికి గురైన వారి కుటుంబాలను టిడిపి ఆకస్మికంగా బాబు సమక్షంలో తెరపైకి తీసుకురావడం, శిల్పా అధికారంలో ఉన్న సమయంలో డజన్ల మంది మైనారిటీలపై రౌడీషీట్లు తెరిచి వేధింపులకు గురిచేసిన అంశాలు వైసీపీకి మైనస్ పాయింటుగా మారాయి.
ఆ వ్యతిరేకతను గమనించిన జగన్.. అభ్యర్థిని కాకుండా తన ను చూసి ఓటేయాలని కోరాల్సి వచ్చింది. అదేవిధంగా వైశ్యులను శిల్పా దూషించారన్న ప్రచారం కూడా ఎన్నికలపై వైసిపి విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చు. గోస్పాడు, రూరల్‌లో ఆయన పర్యటనకు విశేష స్పందన లభించింది. ఇప్పటివరకూ ఆ రెండు చోట్ల పార్టీకి ఢోకా ఉండదంటున్నారు. ఈ రకంగా ప్రచారంలో జగన్ అవిశ్రాంతంగా ప్రచారం చేసి, శ్రేణులకు టానిక్ ఇచ్చారు.
కులాలపై టిడిపి కన్ను
ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండురోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన తన పర్యటనతో విజయాన్ని నిర్దేశించే ముస్లిం, బలిజ, వైశ్య వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన రాకతో టిడిపిలో విజయంపై ధీమా పెరిగింది. ఉప ఎన్నిక ప్రచారంలో తనను కాల్చాలని, ఉరి తీయాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బాబు ఘాటు జవాబు ఇవ్వకుండా, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఓటేస్తే మీ పిల్లలు ఏవిధంగా తయారవుతారు? భావి తరాలకు ఎలాంటి సందేశం వెళుతుందో అర్ధం చేసుకోండని నర్మగర్భంగా తెలియజేశారు. దీంతో పాటు తమ ప్రభుత్వం గత ఆరునెలల్లో నంద్యాలలో పూర్తి చేసిన 2225 కోట్ల విలువైన పనులు, కొత్తగా నిర్మించబోయే ఇళ్ల నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాల గురించి వెళ్లిన ప్రతిచోటా ఏకరవు పెట్టారు.
అంతా సోమిరెడ్డే!
నంద్యాల ఉప ఎన్నికలో ఆద్యంతం సీనియర్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కర్త,కర్మ,క్రియగా వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ఆయన సమన్వయం సాధించారు. వార్డుల వారీగా కుల సమీకరణపై కసరత్తు చేసి, ఏ కులానికి చెందిన మంత్రులు-ఎమ్మెల్యేలను ఆ వార్డులకు ఇంచార్జిలుగా నియమించి, రోజూ సమీక్షించారు. గంగుల ప్రతాపరెడ్డి వంటి సీనియర్‌ను టిడిపి గూటిలోకి తీసుకురాగలిగారు. గంగుల రాకను అడ్డుకున్న మంత్రి అఖిలకు నచ్చచెప్పడం ద్వారా, రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉండే గోస్పాడు, రూరల్ మండలంలో వైసీపీ మెజారిటీని గణనీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు.
వైశ్యులకు శిద్దా మంత్రం
మంత్రి శిద్దా రాఘవరావు ప్రచారానికి రాకముందు వరకూ వైశ్యవర్గం వైసీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపగా, ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. బాబు వచ్చినప్పుడు ఆ ప్రతినిధులతో భేటీ వేయించి, వారికి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై హామీ ఇప్పించగలిగారు. శిద్దా పూర్తిగా వైశ్యులున్న వార్డుల్లో ఒక సామాన్య కార్యకర్తగా తిరిగారు.
కులమే కీలకంగా కదిలిన వైనం
నంద్యాల పట్టణంలో బలిజల్లో ముద్రగడ ప్రభావం తీవ్రంగా ఉంది. దానితో మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కొత్తపల్లి సుబ్బారాయుడు, బొండా ఉమను రంగంలోకి దింపడం ద్వారా ఆ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. బాబు భేటీలో బలిజ వర్గం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడమే దానికి నిదర్శనం. పట్టణంలో ఆ వర్గంలో పట్టున్న మిద్దే శాంతిరాముడును చేర్చుకోవడం ద్వారా, బలిజ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఇక వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న క్రైస్తవ-దళితుల ఓట్లను ఆకట్టుకునేందుకు మంత్రి జవహర్, ఎమ్మెల్యే అనిత, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, మారెప్ప, పరసా రత్నం వంటి దళిత నేతలను రంగంలోకి దింపింది. ప్రచారం ముగింపునకు పదిరోజుల ముందున్న బలహీన పరిస్థితి నుంచి కనీసం పదివేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్న ధీమా దిశగా టిడిపి ప్రచారం ముగిసింది.

చిత్రాలు..నంద్యాలలో సోమవారం ఎన్నికల ప్రచార ముగింపు సభలో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి

*నంద్యాల పట్టణంలోని దేవనగర్‌లో ప్రచారం చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి