రాష్ట్రీయం

నవంబర్‌లోనే మెట్రో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21 : హైదరాబాద్ నగరంలో మెట్రో సర్వీసుల సేవలు నవంబర్‌లో మొదలవుతాయని పురపాలక మంత్రి కె తారకరామారావు చెప్పారు. మెట్రో రైలు రెండోదశ కోసం ఆలోచిస్తున్నామని, స్కైవేల కోసం రక్షణ శాఖ భూములు అడిగామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని ఆయన పేర్కొన్నారు. అన్ని సమస్యలనూ పరిష్కరించుకోవడానికి కేసిఆర్ చేతిలో ఏ అల్లాఉద్దీన్ అద్భుత దీపమో, మంత్ర దండమో లేదని, ప్రణాళికా బద్ధంగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చి దిద్దుతామని తారక రామారావు అన్నారు. బాలానగర్ సర్సాపూర్ చౌరస్తాలో రూ.380కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల వారితో సోదర భావంతో మెలుగుతూ ప్రభుత్వ పరిపాలన నియమబద్ధంగా కొనసాగుతోందని అన్నారు. పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వాటిని అమలు చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. నిరుపేదల కోసం ఓక్క రూపాయి లేకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. రాజధానిలోని బాలానగర్ పారిశ్రామిక వాడలో గత దశాబ్దాల కాలం నుండి ట్రాఫిక్ సమస్యలను తాను కళ్లారా చూశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్లై ఓవర్ నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి కేవలం 18నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ట్రాఫిక్ తల నొప్పులు తప్పించనున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఏన్నికల హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు పరుస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. హోంశాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, జోనల్ కమిషనర్ హరిచందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రాజధానిలో నిర్మిస్తున్న భారీ ఫ్లైఓవర్ శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్