రాష్ట్రీయం

రైతు సమస్యలపై కమిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్రంలో రైతు సమస్యలు, వివాదాల పరిష్కారానికి మూడు నెలల్లోగా కమిషన్ ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈమేరకు ఆదేశాలిచ్చిం ది. చట్టప్రకారం రైతు సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, సర్కార్ పట్టించుకోవడం లేదని పిటీషన్‌లో ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. రైతు కమిషన్ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో మూడు నెలల్లోగా కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం తెలిపింది. దాని పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా కమిషన్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సహా ఐదుగురు సభ్యులు కమిషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.