రాష్ట్రీయం

పాలసీకి పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: కొత్త మద్యం పాలసీని ప్రవేశ పెట్టడానికి ముసాయిదా రూపొందించాల్సిందిగా అధికారులను ఎక్సైజ్ మంత్రి పద్మారావు ఆదేశించారు. మద్యం రిటైల్ షాపుల లైసెన్స్‌దారులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎక్సైజు ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమై కొత్తగా ప్రవేశపెట్టనున్న మద్యం పాలసీపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల పక్కనున్న మద్యం షాపుల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రస్తుతమున్న మద్యం షాపుల ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చేసిన ప్రతిపాదనలను అధికారులు మంత్రికి వివరించారు. గీత కార్మికులు ప్రమాదాల బారినపడకుండా తాటి చెట్లు ఎక్కడానికి అందించే పరికరాలను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నీరా స్టోరేజి, మార్కెటింగ్, గీత కార్మికులకు గుర్తింపు కార్డుల జారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మంత్రి మండిపడ్డారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు కార్మికులకు త్వరగా చేరడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎక్సైజు ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వాల హయాంలో గీత కార్మికులకు జీవనోపాధి లేకుండా చేసి పొట్టకొట్టగా తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో మూతపడిన కల్లు దుకాణాలకు అనుమతి ఇచ్చి వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించారని మంత్రి గుర్తు చేశారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మృత్యువాత పడితే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ. 2 లక్షలను తమ ప్రభుత్వం ఐదు లక్షలకు పెంచిందని మంత్రి అన్నారు. శాశ్వత అంగవైకల్యం కలిగితే వారికి చెల్లించే రూ. 50 వేలను ఐదు లక్షలకు పెంచిందన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్, ఎక్సైజుశాఖ కమిషనర్ చంద్రవదన్, జాయింట్ సెక్రటరీ రామ్‌సింగ్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్‌రావు, టిఎస్‌బిసిఎల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి, ఒఎస్‌డి రాజేశ్వర్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..మద్యం పాలసీ ముసాయదాపై అధికారులతో చర్చిస్తున్న ఎక్సైజ్ మంత్రి పద్మారావు